Prayagraj Monalisa : ఇప్పుడున్న సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో తెలియదు. కొందరు సామాన్యులు ఓవర్ నైట్ సెలబ్రెటీలుగా మారిపోతారు. మహా కుంభమేళాలో ఇదే జరిగింది. ఒక పూసలమ్ముకునే సామాన్యురాలిని సెలబ్రెటీ చేసింది. ఒక్క వీడియోతో సోషల్ మీడియా (Social Media ) ను షేక్ చేసింది. ఆమె తేనె కల్లె ఆమెకు లక్షలాది మందిని ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టి ఆమె జీవితాన్నే మార్చేసింది .
ఉత్తరప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా బోస్లే (Monalisa) కుటుంబం పూసలమ్ముకొని జీవనం సాగిస్తారు.అమ్మ నాన్న లకు సాయంగా మహాకుంభమేళా (Maha Kumbh 2025) కు వచ్చిన ఈ అమ్మాయి పూసలమ్ముకుంటుండగా కొందరు ఆమెని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తన తేనే కళ్ళకు చాలామంది ఫిదా అయిపోయి వీడియో వైరల్ చేశారు.
ఆ వీడియో కాస్త బాలీవుడ్ (Bollywood) దర్శకుడు కంట్లో పడింది. తను ఏకంగా తాను తీయబోయే సినిమాలో నటింప చేస్తానని ప్రకటించాడు. మహా కుంభమేళాలో ఈ అమ్మాయితో చాలామంది వీడియోలు తీసి పోస్ట్ చేశారు. వారి తాకిడిని తట్టుకోలేక వీళ్ళ నాన్న వారి స్వస్థలానికి పంపించేశారు.
ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన మోనాలిసా ను సనోజ్ మిశ్రా (sanoj mishra) అనే బాలీవుడ్ దర్శకుడు తను తీయబోయే ది డైరీ ఆఫ్ మణిపూర్ (dhi dairy of Manipur) అనే మూవీలో ఆఫర్ ఇచ్చాడు. ఏకంగా వారి ఇంటికి వెళ్లి మరీ ఆమె కుటుంబ సభ్యులతో చెప్పి ఒప్పించాడు. దీనికి వారి కుటుంబం కూడా ఒప్పుకోవడంతో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఈ నెలలో అయినా లేదా మార్చిలో అయినా షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. దీనికి ముందు మోనాలిసాకు ఎలా యాక్ట్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వనున్నారట.
ఇదిలా ఉండగా మోనాలిసా (Monalisa ) ఎక్స్ లో ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పోస్టర్ పక్కన నిలబడి ఈరోజు పోస్టర్ బయట రేపు పోస్టర్ లోపల కాలచక్రం అంటే ఇదే తొందరలోనే ముంబైలో కలుద్దాం అల్లు అర్జున్ పుష్ప -2 అంటూ రాసుకొచ్చింది ఈ తేనె కళ్ళ సుందరి. ఈమె నటించే మూవీ ఒకవేళ హిట్టు కొడితే మాత్రం ఆమె జీవితమే మారిపోతుందని నెటిజన్లు అనుకుంటున్నారు. వారి మూవీస్ లో నటింపజేయడానికి ఆమె దగ్గరికి బాలివుడ్ దర్శకులు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. సినిమాల్లో నటిస్తుందని కలలో కూడా ఊహించని మోనాలిసా మునుముందు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నెటిజన్లు కోరుకుంటూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








