PM Modi Mann ki Baat : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Modi Mann ki Baat) కార్యక్రమం (117వ ఎపిసోడ్) ద్వారా ప్రజలను ఉద్దేశించి నేడు మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగంపై కూడా ఆయన మాట్లాడారు. 2025లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందన్నారు. రాజ్యాంగం మనందరికీ అనుసరణీయమని, మార్గదర్శకమని అన్నారు.
వీడియోలు అప్‌లోడ్ చేయండి
రాజ్యాంగ వారసత్వాన్ని దేశ ప్రజలకు చేరువయ్యేలా constitution75.com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామని ప్రధాని మోదీ తెలిపారు. రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశంపై మీ వీడియోలను ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చని అన్నారు. వివిధ భాషల్లో రాజ్యాంగాన్ని చదవచ్చని, అలాగే ప్రశ్నలు అడిగే అవకాశం కూడా అడగొచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతీ యువకులు ఈ వెబ్‌సైట్‌ను వినియోగించి వీడియోలు అప్‌లోడ్ చేయాలని సూచించారు.
Mann ki Baat లో మహా కుంభమేళాపై..
ప్రధాని మహాకుంభం గురించి మాట్లాడుతూ కుంభమేళా విశేషాలు, దాని వైవిధ్యం గురించి చెప్పారు. కుంభమేళాకు కోట్లాది మంది హాజరవుతారని అన్నారు. వివిధ సంప్రదాయాలు, పంతులు, అఖాడాలు ఈ కుంభంలో పాల్గొంటారని, దీనిలో ఏవిధమైన వివక్ష ఉండదని స్పష్టం చేశారు. ఈ సారి కుంభమేళాలో కృత్రిమ మేధస్సు (AI) చాట్‌బాట్ సాయంతో 11 భారతీయ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
KTB యానిమేషన్ సిరీస్ గురించి..
మన్ కీ బాత్‌లో ప్రధాని మాట్లాడుతూ పిల్లల అభిమాన యానిమేషన్ సిరీస్ KTB – ‘భారత్ హైం హమ్’ గురించి ప్రస్తావించారు. ఈ సిరీస్ భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వీరుల గాథలను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు స్మరించిన మోదీ
భారతీయ సినీ పరిశ్రమ దిగ్గజాల 100వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా రాజ్‌కపూర్, మహ్మద్ రఫీని మోదీ స్మరించారు. రాజ్‌కపూర్ భారత సాఫ్ట్ పవర్‌ను ప్రపంచానికి పరిచయం చేయగా, రఫీ తన గానంతో ప్రతి మనసునూ దోచుకున్నారని గుర్తుచేశారు. అలాగే తెలుగు చిత్రపరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు (ANR) ప్రాభవాన్ని ప్రధాని ప్రశంసించారు.
తమిళ భాషపై మోదీ ఏమన్నారంటే..
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన భాష తమిళమని మోదీ అన్నారు. భారతీయులు దీనిపై గర్వపడాలన్నారు. ఫిజీలో మొదటిసారి తమిళం బోధించే కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంలో భారత స్థానం
భారతీయ సంస్కృతిని ప్రపంచంలో విస్తరించడాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. మిస్ర్‌లో ఇటీవల జరిగిన పేపర్ పెంట్ పోటీకి 23,000 విద్యార్థులు పాల్గొని భారతీయ సంస్కృతిని, మిస్ర్‌తో ఉన్న చారిత్రక సంబంధాలను ప్యింటింగ్స్ ద్వారా వెల్లడించారని చెప్పారు. ఇది భారతీయ సంస్కృతి పట్ల ఉన్న వారి అభిరుచి, సృజనాత్మకతకు నిదర్శనమని కొనియాడారు. దక్షిణ అమెరికాలోని పరాగ్వే దేశంలో కూడా భారతీయ సంస్కృతి ప్రతిఫలించుతోందని హర్షం వ్యక్తం చేశారు. పరాగ్వేలో భారతీయ దౌత్య కార్యాలయం ద్వారా ఆయుర్వేద ఫ్రీ కన్సల్టేషన్ అందిస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజల నుంచి దీనికి విశేష స్పందన లభిస్తోందని మోదీ పేర్కొన్నారు.
వావ్స్ (WAVES) సమ్మిట్ గురించి
భారత్‌లో మొదటిసారి వేవ్స్ సమ్మిట్ (World Audio Visual Entertainment Summit) నిర్వహించనున్నట్లు మోదీ చెప్పారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రతినిధులు, సృజనాత్మక రంగాల నేతలు భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు. ఇది భారతదేశాన్ని గ్లోబల్ కంటెంట్ హబ్‌గా మార్చే దిశగా ఒక కీలక అడుగు అన్నారు.
Mann ki Baatలో ఇంకేం అన్నారంటే…
ఇవే కాకుండా మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమాలపై మాట్లాడారు. మలేరియాపై విజయాలు, క్యాన్సర్ చికిత్సలో సాధించిన పురోగతి గురించి వివరించారు. బస్తర్ ఒలింపిక్ ద్వారా యువత ఉత్సాహం, కాలాహాండీలో రైతుల విజయగాథ, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి విస్తరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Mann ki Baat | ప్రధాని మోదీ మన్ కీ బాత్.. ఏమన్నారంటే..”