Medaram Jatara 2026 : 3 కోట్ల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..
మేడారం: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ మహాజాతర–2026 (Medaram Jatara 2026) కు ములుగు జిల్లా మేడారం సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరగనున్న ఈ మహా వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మంత్రి సీతక్క మేడారంలోనే బస చేస్తూ, ప్రతి విభాగాన్ని నిశితంగా సమీక్షిస్తున్నారు.
జాతరను సమర్థంగా నిర్వహించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులతో పాటు, 2,000 మంది ఆదివాసీ యువ వాలంటీర్లు సేవలందిస్తున్నారు.నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా 60 మొబైల్ టవర్లు (27 శాశ్వత, 33 తాత్కాలిక), 450 VHF సెట్లను ఏర్పాటు చేశారు.
మేడారం జాతర 2026 - గణంకాలు
అంశంవివరాలుభక్తుల అంచనాసుమారు 3 కోట్లువిధుల్లో సిబ్బంది42,027 మందిఆర్టీసీ బస్సులు4,000 (51,000 ట్రిప్పులు)మొబైల్ టవర...



