శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ ఆ హీరోయిన్తోనేనా? – Sekhar Kammula Movies
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) రీసెంట్ గా కుబేర (kubera) మూవీతో బంపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ టైమ్ ఆయన కాని జోనర్ లోకి వెళ్ళి డీసెంట్ హిట్ అందుకోవడంతో నెక్స్ట్ మూవీ ఎలాంటిది తీయబోతున్నారో అని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొదటి నుండి కూడా శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.
ఆయన తెరకెక్కించిన హ్యాపీ డేస్, ఆనంద్, ఫిదా, లవ్ స్టోరీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ లాంటి మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీస్ అన్ని కూడా మ్యూజిక ల్ హిట్స్ గా నిలిచాయి. శేఖర్ కమ్ముల సినిమా తీశాడంటే హిట్ అనే టాక్ ఉంటుంది. అంతలా ఆడియన్స్ లో తనదైన మార్క్ చూపించాడు.
కుబేర తో పాన్ ఇండియా డైరెక్టర్…
నాగ చైతన్య (nagachaithanya)తో తీసిన లవ్ స్టోరీ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని తర్వాత ఎలాంటి మూవీ తీస్తారో అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి పాన్ ఇండియా మూవీ తె...




