Sarkar Live

Privacy Policy

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్య‌ద‌ర్శి
Crime

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్య‌ద‌ర్శి

రూ.21వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి.. Nirmal News | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ (Panchayat Secretary) శివకృష్ణ లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Trap) ప‌ట్టుబ‌డ్డాడు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గోడిసెర్యాల గ్రామానికి చెందిన జి.రాజేశం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవ‌డానికి గాను పంచాయతీ కార్య‌ద‌ర్శి వ‌ద్ద అనుమ‌తి కోరాడు. దీంతో కార్య‌దర్శి శివ‌కృష్ణ‌ 12 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో రాజేశం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం గోడిసెర్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ACB అధికారులకు ఇలా ఫిర్యాదు చేయొచ్చు ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా స...
Education Scam | అనుమతులు లేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్న ‘రెజోనెన్స్’ కళాశాలలు
Special Stories

Education Scam | అనుమతులు లేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్న ‘రెజోనెన్స్’ కళాశాలలు

రంగురంగుల బ్రోచర్ల మాయలో పడిపోతున్న తల్లిదండ్రులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏం చేస్తోంది? Education Scam in Hanmakonda | ఆకర్షణీయమైన యాడ్ లు, నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు, తల్లిదండ్రులను బురిడీ కొట్టించే బ్రోచర్ లు, మాయమాటలతో కనికట్టు చేసే పిఆర్వోలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కార్పొరేట్ కాలేజీగా ప్రచారం చేసుకోవడంలో రెజోనెన్సు కళాశాల యాజమాన్యం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి వుంది. పెద్ద ఎత్తున అడ్మిషన్లనే టార్గెట్ గా పెట్టుకున్న సదరు కళాశాల యాజమాన్యం.. ఎక్కడ ఖాళీ బిల్డింగ్ దొరికితే చాలు అక్కడ బ్రాంచీలు ఓపెన్ చేసి తమ విద్యా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ కాలేజీ కి అనుమతులు ఎన్ని? వారు నిర్వహిస్తున్న బ్రాంచీలు ఎన్ని ? అనే విషయం ఇప్పుడు ఇటు విద్యాశాఖతో పాటు అటు హన్మకొండ నగరంలో చర్చనీయాంశంగా...
GHMC | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
Crime

GHMC | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

ACB Raids in GHMC | రాష్ట్రంలో ఏసీబీ అధికారుల దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అంద‌గానే త‌క్ష‌ణ‌మే అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో అవినీతి అధికారుల‌ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటున్నారు. తాజాగా అంబర్ పేట జీహెచ్ఎంసీ (GHMC ) లో ఏఈ మనీషా.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వ‌ల‌కు చిక్కింది. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేయడంతో ఇప్పటికే 5 వేల రూపాయలు ఇచ్చిన స‌ద‌రు కాంట్రాక్టర్. ఒప్పందం ప్రకారం మరో రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో విసిగిపోయాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించ‌డంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితుని ఫిర్యాదుతో నిఘా ఉంచి జీహెచ్ఎంసీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు సరిగ్గా లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ మనీషాను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌డుతున్నారు. ఇలా ఫిర్యాదు చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంద...
Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
State, Districts

Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు పెద్దపులి (Tiger) సంచ‌రిచ‌డం కలకలం రేపుతోంది. పులి తిరుగుతోంద‌ని తెలియ‌డంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి వెళ్లేందుకు వ‌ణికిపోతు న్నారు. తాజాగా బోథ్ ‌మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్ద‌పులి ద‌ర్జాగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొంద‌రు యువకులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కాగా బోథ్‌ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ కూడా అయింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని అధికారులు చెబుతున‌నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని ...
error: Content is protected !!