Sarkar Live

Privacy Policy

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి – Assembly Winter Sessions
State, Hyderabad

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి – Assembly Winter Sessions

ప్రారంభమైన శాసనసభ సమావేశాలు.. సంతాప తీర్మానాల అనంతరం వాయిదా ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి సభకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేల ఘన స్వాగతం జనవరి 2 వరకు అసెంబ్లీ వాయిదా.. మాజీ సర్పంచుల ముట్టడితో ఉద్రిక్తత Telangana Assembly Winter Sessions : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ఆకర్షణగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) చాలా కాలం తర్వాత సభకు హాజరుకావడం నిలిచింది. సభ ప్రారంభం కావడానికి ముందే కేసీఆర్ తన సీటులో వచ్చి కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి రాగానే నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. మర్యాదపూర్వకంగా నమస్కరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రు...
ATM Theft Gang | వరంగల్‌లో ఏటీఎం చోరీల ముఠా గుట్టురట్టు:
Crime

ATM Theft Gang | వరంగల్‌లో ఏటీఎం చోరీల ముఠా గుట్టురట్టు:

ఇనుప రేకులతో మాయాజాలం.. రాజస్థాన్ కేటుగాళ్లు అరెస్ట్! కాజీపేట, డిసెంబర్ 28: ఏటీఎం యంత్రాల్లో చిన్న ఇనుప రేకును అడ్డం పెట్టి, ఖాతాదారులు డ్రా చేసే నగదు బయటకు రాకుండా అడ్డుకుని, ఆ తర్వాత ఆ సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ ముఠాను (ATM Theft Gang) వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిసిఎస్‌ (CCS) మరియు కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ. 5,10,000 నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, నేరానికి వాడే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. . నిందితుల వివరాలు : అరెస్టు అయిన వారంతా రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్ జిల్లా, మాల్కిడా తాలూకాకు చెందిన ఆరిఫ్ ఖాన్ (23), 2. సర్ఫరాజ్ (24), 3. ఎం. ఆష్ మహ్మద్ (29), 4. షాపుస్ ఖాన్ (33), 5. షారూఖాన్ (33), 6. అస్లాం ఖాన్ (33), 7. ఎం. షారుఖాస్ (27). మరో నిందితుడు ...
Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు
National

Rahul Gandhi | ప్రజాస్వామ్యమా.. రాచరికమా? కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు

న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకం (MNREGA) పేరు మార్పు మరియు దాని రూపురేఖలను మారుస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. యుపిఏ హయాంలో కోట్లాది మంది పేదలకు అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని రాహుల్ అన్నారు. ఈ కీలక నిర్ణయాన్ని కనీసం కేబినెట్‌లో చర్చించకుండా, సంబంధిత శాఖా మంత్రులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. "ఇది ప్రజాస్వామ్యమా? లేక ఒకే వ్యక్తి నిర్ణయాలు అమలు చేసే రాచరిక వ్యవస్థా?" అని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధ...
హైదరాబాద్‌లో ఘోరం : పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త.. అడ్డువచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసి దారుణం!
Crime

హైదరాబాద్‌లో ఘోరం : పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త.. అడ్డువచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసి దారుణం!

Hyderabad Nallakunta Murder Case : నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గుండె తరుక్కుపోయే విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగకు ముందు రోజు (డిసెంబర్ 24) తెల్లవారుజామున ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పిల్లల ముందే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ ఘటనలో భార్య మరణించగా, తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారికి గాయాలయ్యాయి. ప్రేమ వివాహం.. అనుమానంతో వేధింపులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు త్రివేణి (26), నిందితుడు వెంకటేష్ నల్గొండ జిల్లా హుజురాబాద్ నివాసితులు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నరేష్, సాత్విక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వెంకటేష్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను తరచుగా శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో త్రివేణి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయినప్పటికీ, వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకుం...
Journalist | జర్నలిస్టుల ‘అక్రిడిటేషన్’ జీవోపై రగడ: 27న కలెక్టరేట్ల ముట్టడికి TUWJ పిలుపు!
State, warangal

Journalist | జర్నలిస్టుల ‘అక్రిడిటేషన్’ జీవోపై రగడ: 27న కలెక్టరేట్ల ముట్టడికి TUWJ పిలుపు!

జి.ఓ నంబర్ 252ను వెంటనే సవరించాలి రెండు కార్డుల విధానం వద్దు.. 10 వేల కార్డుల కోతపై ఆగ్రహం డెస్క్ జర్నలిస్టులకు, కేబుల్ ఛానళ్లకు అన్యాయం హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జి.ఓ నంబర్ 252 తీవ్ర లోపభూయిష్టంగా ఉందని, దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోతున్నారని TUWJ (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ధ్వజమెత్తింది. ఈ అనాలోచిత జీవోను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు యూనియన్ ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, కోశాధికారి పి.యోగనంద్, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, ఐజేయు నేత అవ్వారి భాస్కర్ తదితరులు మాట్లాడారు. జీవోలోని ప్రధాన లోపాలు - TUWJ అభ్యంతరాలు:...
error: Content is protected !!