Sarkar Live

Privacy Policy

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!  – TG Inter Results 2026
career

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి! – TG Inter Results 2026

TG Inter Results 2026 | తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు, విద్యా శాఖ సెక్రటరీ ఐఏఎస్ యోగిత రాణా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. కేవలం 25 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు ప్రకటించడం విశేషం. విభాగంవివరాలుమొత్తం విద్యార్థులుసుమారు 10 లక్షలుఫస్ట్ ఇయర్ విద్యార్థులు4,89,126సెకండియర్ విద్యార్థులు5,07,949పరీక్షా కేంద్రాలు1,495మూల్యాంకన కేంద్రాలు20 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? విద్యార్థులు తమ ఫలితాలను రెండు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు: 1. అధికారిక వెబ్‌సైట్ ద్వారా: మొదట tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో 'TS Inter Results 2026' లింక్‌పై ...
ఏసీబీ, టాస్క్ ఫోర్స్ నజర్ వేసేనా? 
Special Stories

ఏసీబీ, టాస్క్ ఫోర్స్ నజర్ వేసేనా? 

బయటపడితే పదుల సంఖ్యలో అధికారులు అవుట్! ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు.. తలలు పట్టుకున్న తహశీల్దార్ లు తమ పేర్లు ఎక్కడ బయటకొస్తాయోనని టెన్షన్ లో అధికారులు​ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. ఆ పేరే "శేఖర్". వ్యవస్థను తన కబంధ హస్తాల్లో ఉంచుకుని, చట్టాన్ని చుట్టంలా మార్చుకున్న ఈ 'బారాణ బ్రోకర్' (Revenue Broker) లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడుతోంది. శేఖరుడి వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తాలెవరివి? రెవెన్యూ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఈ చక్రవర్తి కథాకమీమామిషు ఏంటి? ​బ్యాంకు లావాదేవీలు బయటపడితే.. వికెట్లు పడాల్సిందే! ​శేఖరుడి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై నిఘా పెడితే సంచలన నిజాలు బయటకు వస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా తహశీల్దార్ ల బినామీలకు, కొంత మంది రెవెన్యూ ఉద్యోగులకు ఈ దళారీ అకౌం...
నిప్పుకణిక.. సురేఖ: గృహిణి నుంచి కేబినెట్ మంత్రి వరకు.. వరంగల్​కు ‘కొండంత అండ! – Konda Surekha
Special Stories

నిప్పుకణిక.. సురేఖ: గృహిణి నుంచి కేబినెట్ మంత్రి వరకు.. వరంగల్​కు ‘కొండంత అండ! – Konda Surekha

Konda Surekha Political journey | తెలంగాణ రాజకీయ యవనికపై ఆమె ఒక సంచలనం. బెదురు లేని మాట.. వెనకడుగు వేయని నైజం.. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగే ప్రయాణం. ఆమే కొండా సురేఖ. సాధారణ గృహిణి స్థాయి నుండి రాష్ట్ర కేబినెట్ మంత్రి వరకు ఆమె ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు. ​పోరాటాలే పునాదిగా.. రాజకీయ ప్రస్థానం ​బీసీ బిడ్డగా సామాన్య కుటుంబంలో జన్మించిన సురేఖ, (Konda Surekha) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు (Ex MLC Konda Muralidhar Rao) వెన్నుదన్నుతో రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగారు. 1995లో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె, వరుస విజయాలతో వరంగల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా నిలిచారు. ​తూర్పు ...
ఖాకీ డ్రెస్సులో నిఖార్సైన ‘సింహం..’నేరగాళ్లపై ఉక్కుపాదం, బాధితులకు ఆప్తబంధువు! – Warangal CP Sunpreet Singh
Special Stories

ఖాకీ డ్రెస్సులో నిఖార్సైన ‘సింహం..’నేరగాళ్లపై ఉక్కుపాదం, బాధితులకు ఆప్తబంధువు! – Warangal CP Sunpreet Singh

Warangal CP Sunpreet Singh | శాంతిభద్రతల పరిరక్షణలో ఆయనొక 'ఉక్కుపాదం'. అన్యాయంపై గర్జించే 'సింహం'. కానీ, కష్టాల్లో ఉన్న సామాన్యుడికి మాత్రం ఆయనొక 'ఆప్తబంధువు'. ఆయనే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్. అసాంఘిక శక్తులకు 'సింహస్వప్నం'గా, సామాన్య ప్రజలకు 'భరోసా'గా నిలుస్తూ వరంగల్ కమిషనరేట్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్న నిఖార్సైన ఐపీఎస్ అధికారి. ​నిబద్ధతకు నిలువుటద్దం.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేరాఫ్ అడ్రస్! ​సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ సీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇక్కడ పోలీసింగ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. "పోలీసు అంటే భయం కాదు.. రక్షణ కల్పించే ఒక నమ్మకం" అనే భావనను ప్రజల్లో బలంగా నాటారు. క్షేత్రస్థాయి కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేసేలా కఠినమైన క్రమశిక్షణను అమలు చేస్తూ, వ్యవస్థలో సరికొత్త జవజీవాలు నింపారు. ​నేరగాళ్ల గుండెల్లో వణుకు.. నగ...
అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం: ఎస్సై  సస్పెన్షన్
Crime

అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం: ఎస్సై  సస్పెన్షన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్  సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ​ఎస్సై సతీష్‌పై గత కొంతకాలంగా ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జరిగిన అంతర్గత విచారణలో ,విధి నిర్వహణలో భాగంగా పలువురి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.​నమోదైన కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించడం, బాధితులకు సకాలంలో స్పందించకపోవడంపై విచారణాధికారులు నివేదిక అందించారు.ప్రాథమిక విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సిపి ఆయనను సస్పెండ్ చేశారు.​శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఈ సస్పెన్షన్ ద్వారా పోలీస్ కమిషనరేట్ బలమైన సంకేతాలను పంపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీస్ వ...
error: Content is protected !!