BSNL BiTV : రీఛార్జ్ లేకుండా 450 లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా చూసేయండి..
BSNL BiTV : భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులందరికీ ఉచితంగా లైవ్ టీవీ ఛానెళ్లను అందించడం ద్వారా సంచలనం సృష్టించింది. బిఎస్‌ఎన్ఎల్ కంపెనీ 450 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూపిస్తోంది. వీటి కోసం వినియోగదారులు ఎటువంటి అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు చేసే ఏ రీఛార్జి ప్లాన్ తీసుకున్నా ఈ బిఐ టీవీ సౌకర్యం అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. మరో విషయమేంటంటే ప్రజల ఫోన్లలో ఇంటర్నెట్ లేకపోయినా, వారు ప్రత్యక్ష టీవీ ఛానెళ్లను చూడగలుగుతారు. ఈ సేవ పేరు BSNL BiTV. ఈ సేవ ఎలా పనిచేస్తుందో ఇపుడు తెలుసుకుందాం.
BSNL BiTV అనేది ఒక కొత్త టెక్నాలజీ. దీని ద్వారా కంపెనీ తన వినియోగదారులకు వారి మొబైల్ ఫోన్లలో 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తుంది. మీరు ఉచితంగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు కూడా వీక్షించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అందరు BSNL కస్టమర్లు...




