Sarkar Live

Privacy Policy

Sangareddy | స‌ర్పంచ్ అభ్య‌ర్థి అనుమానాస్ప‌ద మృతి- కాంగ్రెస్ నేత ఫామ్‌హౌజ్ స‌మీపంలో ఘ‌ట‌న‌
Crime

Sangareddy | స‌ర్పంచ్ అభ్య‌ర్థి అనుమానాస్ప‌ద మృతి- కాంగ్రెస్ నేత ఫామ్‌హౌజ్ స‌మీపంలో ఘ‌ట‌న‌

స‌ర్పంచ్‌ అభ్య‌ర్థి (sarpanch contestant) అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సంఘ‌ట‌న‌ సంగారెడ్డి (Sangareddy) జిల్లా రాయికోడ్ (Raikode) మండ‌లంలో ఈ రోజు వెలుగు చూసింది. పిప్పాడ‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా నామినేష‌న్ దాఖ‌లు చేసిన వ‌ల్కి రాజు మృత‌దేహం కాంగ్రెస్ (Congress) మండ‌ల అధ్య‌క్షుడు బాలాజీ న‌ర‌సింహులు ఫామ్‌హౌజ్ స‌మీపంలో ల‌భ్యమైంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఫామ్‌హౌజ్‌కు వెళ్లాక ఏం జ‌రిగింది? స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త వ‌ల్కి రాజు తన స్వ‌గ్రామం పిప్పాడ‌ప‌ల్లి (Pippadpally) పంచాయ‌తీకి స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ (nomination) దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు బాలాజీ న‌ర‌సింహులును క‌ల‌వ‌డానికి గ్రామ శివారులో ఉన్న ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. ఎన్నిక‌ల ప్ర‌చారం (election campaign), విజ‌యం సాధించ‌డాన...
Hyderabad | కాల్పులు జ‌రిపి.. క‌త్తుల‌తో న‌రికి రియ‌ల్ట‌ర్ దారుణ హ‌త్య
Crime

Hyderabad | కాల్పులు జ‌రిపి.. క‌త్తుల‌తో న‌రికి రియ‌ల్ట‌ర్ దారుణ హ‌త్య

హైదరాబాద్ (Hyderabad) జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో ఈ రోజు ఉద‌యం దారుణ హ‌త్య చోటుచేసుకుంది. ర‌త్నం అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి (Real estate businessman)ని గుర్తుతెలియ‌ని దుండ‌గులు న‌డిరోడ్డుపై న‌రికి చంపారు. బైక్‌పై ఉన్నఅత‌డిపై తొలుత కాల్పులు జ‌రిపి, ఆపై క‌త్తుల‌తో దాడి చేసి హ‌త్య (murder) చేశార‌ని తెలుస్తోంది. ఆర్థిక వైరం ప్రధాన కారణమా? స్థానికుల నుంచి స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని చేరుకొని ప‌రిశీలించారు. హ‌త్యకు దుండ‌గులు ఉప‌యోగించిన క‌త్తిని స్వాధీనం చేసుకొని, ఇత‌ర ఆధారాల‌ను సేక‌రించారు. చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజ్‌ను కూడా సేకరించారు. ఆస్తుల వివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో చోటుచేసుకున్న విభేదాలే (financial issue) ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలోనే దుండ‌గులు రత్నంను న‌డిరోడ్డుపై మ‌ర్డ‌ర్ చేస...
కవ్వాల్‌లో New Tiger Corridor – రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ
State

కవ్వాల్‌లో New Tiger Corridor – రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ

New Tiger Corridor : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంరక్షణకు అట‌వీ శాఖ (forest department) మరో పెద్ద అడుగు వేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ (Kawal) టైగర్ రిజర్వ్‌ వరకు కొత్తగా పులుల కారిడార్ (Tiger Corridor)‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. త‌ద్వారా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పులుల సంఖ్య సహజ రీతిలో పెరగడమే లక్ష్యంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించింది. New Tiger Corridor : పులులు సురక్షితంగా సంచారించాల‌నే ల‌క్ష్యం తిప్పేశ్వర్ (Tippeshwar Tiger Reserve in Maharashtra) రిజర్వ్‌లో ఉన్న పులులు జత కోసం ప్రతి సంవత్సరం న‌వంబ‌రు నుంచి జనవరి మధ్య విప‌రీతంగా సంచ‌రిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల దిశగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే.. సరైన మార్గం లేకపోవడం, మధ్యలో గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు ఉండటం వంటి కారణాలతో పులులకు ప్రమాదం ఏర్పడే ...
Global Summit కు స‌ర్వం సిద్ధం- ముస్తాబైన‌ ఫ్యూచ‌ర్ సిటీ
State

Global Summit కు స‌ర్వం సిద్ధం- ముస్తాబైన‌ ఫ్యూచ‌ర్ సిటీ

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Telangana Global Summit)కు స‌ర్వం సిద్ధ‌మైంది. డిసెంబ‌రు 8, 9 తేదీల్లో నిర్వ‌హించే ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు (International event)కు దేశ విదేశాల నుంచి ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ స‌మీపంలోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ (Bharat Future City) వ‌ద్ద ఈ స‌మ్మిట్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. ఇది రెండు రోజుల‌పాటు జ‌రిగే స‌ద‌స్సు అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల ద‌ర్శ‌నార్థం (ప‌బ్లిక్ ఎగ్జిబిష‌న్‌) ఫ్యూచ‌ర్ సిటీని డిసెంబ‌రు 10, 11, 12 తేదీల్లో తెర‌చి ఉంచ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ల‌క్ష్యం ఏమిటి? తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యం Vision 2047లో భాగంగా ఈ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీని సాధించుకోవాల‌న్న‌ల‌క్ష్యంతో స‌ర్కారు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింది. దీనిని ...
Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!
National

Flight cancellation impact : ప్రయాణికుల కోసం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు!

Flight cancellation impact : ఇండిగో విమానాలు అక‌స్మాత్తుగా రద్దు కావడం (Indigo flight cancellations)తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌, చైన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీ వంటి ప్ర‌ధాన న‌గ‌రాలకు రాక‌పోక‌లు సాగించే వారు అసౌక‌ర్యానికి గురవుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడటంతో రైల్వే శాఖ (Indian Railways) తక్షణమే స్పందించింది. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయంగా ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణాలు రద్దు కావడం వల్ల సహజంగానే రైళ్లకు డిమాండ్ (Rail travel demand India) ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్‌లు పెరిగి ప్రయాణికులకు అందుబాటు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన‌ రైల్వే శాఖ ప్రజలకు సౌకర...
error: Content is protected !!