Kingdom | పాజిటివ్ టాక్ వస్తే చాలు రౌడీ హీరో కెరీర్ గాడిన పడినట్టే…!
Kingdom Movie Release | కొందరు హీరోలకు హిట్టు ప్లాప్ లతో సంబంధం ఉండదు. మూవీస్ తీసుకుంటూ వెళ్తారు.అవి హిట్టయిన ఫ్లాఫ్ అయినా వారి రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు.అలాంటి హీరోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన లాస్ట్ హిట్టు ఏంటనేది కూడా ఫాన్స్ మరిచిపోయే ఉంటారు.అలాంటి హీరో నుండి మూవీ వస్తుందంటే పెద్దగా బజ్ ఉండదు.
కానీ విజయ్ లెటెస్ట్ మూవీ కింగ్ డమ్ (Kingdom)పై ఆ ఎఫెక్ట్ ఉన్నట్టు కనబడట్లేదు. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండే ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. గౌతమ్ తిన్ననూరి(Goutham thinnanuri)డైరెక్టర్ కావడంతో ఈసారి పక్కా హిట్టు కొట్టడం ఖాయం అని ధీమాతో ఉన్నారు. మళ్ళీరావా, జెర్సీ (Malli Rava, Jersi)మూవీలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కావడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది.
విజయ్ లుక్, మ్యూజిక్ తో హైప్…
ఇక రౌడీ స్టార్ క్రేజ్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పెరిగిప...