Sarkar Live

Privacy Policy

Food Poisoning  | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..
Crime

Food Poisoning | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..

Food Poisoning | గద్వాల: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో వ‌రుస‌గా ఫుడ్‌పాయిజ‌న్ కేసులు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో ఈరోజు ఉద‌యం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ద‌వాహాన‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉంటున్నారు. పురుగులు ఉన్నాయని చెప్పినా నిర్లక్ష్యం! ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విద్యార్థులు సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం వండిన ఉప్మాలో పురుగులు ఉన్నట్లు తాము గుర్తించి, వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే వారు ఆ ఆహారాన్ని పారబోసినప్పటికీ, అంతకుముందు దాన్ని తిన్నవారే అస్వస్థతకు గురయ్యారని తెలిపార...
Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!
State, Crime

Bomb Threat | కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు!

హుటాహుటిన ముంబైకి మళ్లింపు.. ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్! హైదరాబాద్‌ | కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో 'మానవబాంబు' బెదిరింపు (Indigo Bomb Threat) కలకలం సృష్టించింది. ఈ తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించారు. Bomb Threat : ప్రమాద హెచ్చరిక ఎలా వచ్చింది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు వేకువజామున 1:20 నిమిషాలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం (Flight) ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. "విమానంలో మానవబాంబు ఉంది, దీన్ని పేల్చివేస్తాం" అంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి.. ముంబైలో కట్టుదిట్టమైన భద్రత ఈమెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అప్రమత్తమై, విమ...
Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు
Crime, warangal

Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు

ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఘరానా ముఠా అరెస్టు.. రూ. 50 లక్షలకు పైగా దోపిడీ ముఠాలోని ఐదుగురి సభ్యుల అరెస్టు Fake ACB DSP Arrest | వరంగల్ : ఏసీబీ డీఎస్పీగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరించి, భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఒక ఘరానా మోసగాడితో సహా ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ముఠాలో మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఐదు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన రాచంపల్లి శ్రీనివాస్ (Rachampalli Srinivas) అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు (45) ఉన్నాడు. అతనికి సహకరించిన నలుగురు వ్యక్తులు (న...
LPG Cylinder Price | LPG సిలిండర్ ధర నేటి నుంచి తగ్గింపు..
Business

LPG Cylinder Price | LPG సిలిండర్ ధర నేటి నుంచి తగ్గింపు..

హైదరాబాద్ : కొత్త నెల ప్రారంభం కావడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులపై భారం తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల ధరల(LPG Cylinder Price)ను తగ్గించినట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై దాదాపు రూ. 10 తగ్గింపు లభించింది. వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు (19 కేజీలు): నెలవారీ సమీక్షలో భాగంగా, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతరం మారుతూ వొస్తున్నాయి. తాజా తగ్గింపు తర్వాత ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం ఇలా ఉన్నాయి: నగరంపాత ధర (నవంబర్)కొత్త ధర (డిసెంబర్ 1)మార్పు (సుమారు)ఢిల్లీ₹1,590.50₹1,580.50₹10 తగ్గింపుకోల్‌కతా₹1,694.00₹1,684.00₹10 తగ్గింపుముంబై₹1,541.50₹1,531.50₹10 తగ్గింపుచెన్నై₹1,749.50₹1,739.50₹10 తగ్గింపు గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరలు హెచ్...
Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు
National

Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు

Maoist Surrender Dantewada : మావోయిస్టు పార్టీకి మరోమారు ఎదురుదెబ్బ‌ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌, దంతెవాడ జిల్లాలో ఆదివారం, (నవంబర్ 30) ఏకంగా 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 65 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. 'పూనా మర్గం'కు ఆకర్షితులై.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న 'పూనా మర్గం' (Puna Narkom - నక్సలిజం వీడి తిరిగి రండి) అనే ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు వారు ప్రకటించారు. తాము హింసామార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకముంద‌ని మావోయిస్టులు వెల్ల‌డించారు. లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడలోని డీఆర్‌జీ (DRG) కార...
error: Content is protected !!