Sarkar Live

Privacy Policy

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిక
Crime

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిక

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతున్న ఇటువంటి అమానవీయ చర్యలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ​చట్ట ఉల్లంఘనలపై నిఘా: గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, ఇతరులకు తెలియజేయడం లేదా ఆ సమాచారం ఆధారంగా గర్భస్రావం చేయించడం నేరమని, వీటిని అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ​స్కానింగ్ సెంటర్లు అప్రమత్తం: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. ​ప్రజల భాగస్వామ్యం: ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు తెల...
జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో వరంగల్ పీఆర్వో మోహన కృష్ణ మెరుపులు
Crime

జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో వరంగల్ పీఆర్వో మోహన కృష్ణ మెరుపులు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ (AIPDM) లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రతిభ చాటింది. కమిషనరేట్ పీఆర్వో విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మన్నవ మోహన కృష్ణ తన అద్భుతమైన ఫోటోగ్రఫీ నైపుణ్యంతో జాతీయ స్థాయిలో రాణించారు. ​మార్చి 29న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలు పాల్గొన్నాయి. ఇందులో "ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ టీం" విభాగంలో మోహన కృష్ణ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, తెలంగాణ పోలీస్ ఫోటోగ్రాఫర్స్ టీంను ద్వితీయ స్థానంలో నిలబెట్టారు.నాగ్‌పూర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన ముగింపు వేడుకలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ​మోహన కృష్ణ తన టీం సభ్యులైన కోచ్ జయరాజ్, కానిస్టేబుల్ రాజశేఖర్‌లతో కలిసి కేంద్ర మంత్రి చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీని అందుకున్నారు.​"పోలీస...
Textile Hub | పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
State

Textile Hub | పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్

Textile Hub | హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరిగిన ఆసియా టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ భవిష్యత్తుపై తన దార్శనికతను చాటారు. రాష్ట్రం కేవలం పారిశ్రామికంగానే కాకుండా, ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడేలా 'తెలంగాణ రైజింగ్ 2047' (Telangana Rising 2047) విజన్‌ను ఆయన ప్రకటించారు. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూనే, స్థానిక వస్త్ర రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని హామీ ఇచ్చారు. టెక్స్‌టైల్: మన డీఎన్ఏలోనే ఉంది! తెలంగాణకు, వస్త్ర రంగానికి ఉన్న చారిత్రక అనుబంధాన్ని సీఎం గుర్తు చేశారు. నిజాం కాలం నుండే హైదరాబాద్ ముత్యాలు, వస్త్రాలకు ప్రపంచ కేంద్రంగా ఉండేదని పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీలు కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, మన సంస్కృతికి ప్రతీకలని ఆయన కొనియాడారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాల...
మహిళా లోకానికి శుభవార్త.. గ్రామాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు! – Women Shakti Buildings
State

మహిళా లోకానికి శుభవార్త.. గ్రామాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు! – Women Shakti Buildings

8193 స్థలాల గుర్తింపు, 6261 భవనాలకు అనుమతులు, 5017కు అంచనాలు సిద్ధం యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేపల్లి గ్రామంలో తొలి భవనం ప్రారంభం Women Shakti Buildings | తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరా మహిళా శక్తి' పథకం క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహిళా సంఘాల (VO) కోసం గ్రామాల్లో ప్రత్యేక భవనాల నిర్మాణం ఇప్పుడు యజ్ఞంలా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో స్థలాలను గుర్తించి, పనులను వేగవంతం చేశారు. అంశంప్రస్తుత పరిస్థితిమొత్తం గ్రామ పంచాయతీలు12,728గుర్తించిన స్థలాలు8,193కలెక్టర్ల నుంచి అనుమతులు6,261సిద్ధమైన అంచనాలు (Estimates)5,017 ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవనాల నిర్మాణానికి కనీసం 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల‌తో 12,728 గ్రామ పంచాయతీలు ఉండగా...
రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal
State, Hyderabad

రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal

Highlightsఒకే గొడుగు కిందకు మూడు విభాగాలుBhu Bharati Portal ప్రాజెక్ట్ అమలు కానున్న 5 మండలాలు ఇవే:భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ప్రత్యేకతలు:సర్వే ప్రక్రియ సాగుతుందిలా.. ఒకే గొడుగు కిందకు మూడు విభాగాలు Bhu Bharati Portal Pilot Launch | తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపొందించిన 'భూభారతి' (Bhu Bharati) పోర్టల్‌ను రేపటి నుంచి (ఏప్రిల్ 2) ప్రయోగాత్మకంగా ఐదు మండలాల్లో ప్రారంభించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను సమన్వయం చ...
error: Content is protected !!