Singer Mangli | సింగర్ మంగ్లీ కేసులో అనూహ్య మలుపులు: మైక్రో ఫైనాన్స్ స్కామ్ వెనుక అసలేం జరుగుతోంది?
ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల నుంచి మీడియా రచ్చ వరకు చేరింది. మైక్రో ఫైనాన్స్ పేరిట కోట్లాది రూపాయల మోసం జరిగిందంటూ న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలు, దానికి మంగ్లీ ఇచ్చిన కౌంటర్లతో ఈ కేసు ఒక మిస్టరీలా మారుతోంది. రోజుకో ట్విస్ట్‌తో సాగుతున్న ఈ వ్యవహారంలో అసలు నిందితులు ఎవరు? బాధితుల వెర్షన్ ఏమిటి? అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
సింగర్ మంగ్లీ అండ్ టీమ్ మైక్రో ఫైనాన్స్ పేరిట తమను భారీగా మోసం చేశారని అడ్వొకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ రచ్చ మొదలైంది. సుమారు రూ.10 కోట్ల మేర మోసం జరిగిందని, ఈ విషయంలో తనకు ప్రాణహాని ఉందని సుబ్బారావు పేర్కొన్నారు.
మంగ్లీ వెర్షన్ ఇదీ : కాగా తనపై వచ్చిన ఈ ఆరోపణలను మంగ్లీ తోసిపుచ్చారు. సుబ్బారావు అనే వ్యక్తి బిగ్ బాస్ షోకు వెళ్లేందుకే, ఫేమస్ అ...




