Champions Trophy 2025 | ‘హైబ్రిడ్’ మోడల్‌ని అంగీకరించండి పాకిస్తాన్‌కు ఐసీసీ అల్టిమేటం
Champions Trophy 2025 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్‌కు అల్టిమేటం జారీ చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 'హైబ్రిడ్' మోడల్‌ను అంగీకరించాలని లేకుంటే ఈవెంట్ నుంచి తప్పిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి-మార్చి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గాను శుక్రవారం సమావేశం జరిగింది. పాకిస్తాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా UAEలో టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించే 'హైబ్రిడ్' మోడల్‌ను పాకిస్తాన్ తిరస్కరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. సరైన భద్రత లేని కారణంగా పాకిస్తాన్‌కు వెళ్లకూడదని భారతదేశం నిర్ణయించుకుంది.
చాలా మంది ఐసిసి బోర్డు సభ్యులు పాకిస్తాన్ పరిస్థితి పట్ల సానుభూతి చూపినప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ 'హైబ్రిడ్' మోడల్‌ను మాత్రమే ఆచరణీయ పరిష్కారంగా అంగీకరించాలని కోరారు. భారత జట్టు లేకుండా బ్రాడ్‌కాస్టర్‌లు పెట్టుబడులు పెట్టే అవకాశం ...