TS EAPCET 2025 : దరఖాస్తు ప్రక్రియ షురూ.. గడువు ఎప్పటి వరకు అంటే..
విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET) ఒకటి. తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) ఈ పరీక్ష కోసం దరఖాస్తుల ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభిస్తోంది. విద్యార్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ eapcet.tsche.ac.in ద్వారా ఏప్రిల్ 4లోగా సమర్పించొచ్చు.
రెండు విడతలుగా TS EAPCET 2025
వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల పరీక్షలు : 2025 ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఉదయం 9:00 గంటల నుంచి 12:00 వరకు
ఇంజనీరింగ్ కోర్సుల పరీక్షలు : 2025 మే 2, 5 తేదీల్లో మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు
ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. విద్యార్థులు నిర్ణీత తేదీలకు ముందే తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలు (Eligibility Criteria)
TS EAPCET 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకునే...




