ASHA Workers | ఆశా కార్యకర్తలకు వరాలు గ్రాట్యుటీ, ఇతర సౌకర్యాలు
Good News for ASHA Workers : ఆశా కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu) శుభవార్త చెప్పారు. వారికి గ్రాడ్యుటీ (gratuity) చెల్లింపు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. వీరికి ప్రసూతి సెలవుల (maternity leave)ను పెంచడం, రిటైర్మెంట్ (retirement ) వయసును పొడించడం లాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆశా కార్యకర్తల సేవలు అత్యంత కీలకమని, వారి సంక్షేమాన్ని మెరుగుపర్చడం తమ బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 42,752 ఆశా కార్యకర్తలకు ప్రయోజనం
ఆశా కార్యకర్తలు (Accredited Social Health Activists - ASHA) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువులతోపాటు వైద్య సేవల అవసరం ఉన్న ప్రజలకు వీరు...




