Sarkar Live

Privacy Policy

National

Delhi Blast Case : టెర్రర్ మాడ్యూల్‌ దర్యాప్తులో సంచ‌ల‌న‌ విష‌యాలు..

Delhi Blast Case | దిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి బయటపడిన ఫరీదాబాద్‌ వైట్ కాలర్ టెరర్ మాడ్యూల్ కేసులో దర్యాప్తు శ‌ర‌వేగంగా సాగుతోంది. టెర్రర్ మాడ్యూల్ సభ్యులు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని మౌల్వీ ఇష్తియాక్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇష్తియాక్ మాత్రం అరెస్ట‌యిన ఉగ్రవాదులు తనకు బకాయిగా ఉన్న అద్దె ఇవ్వాలని పదే పదే కోరడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తీవ్రతగల కేసు ఉన్నప్పటికీ, ఆయనకు కేవలం కిరాయి అంశమే ముఖ్యమైందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కీలక నిందితుడు డాక్ట‌ర్‌ ముజమ్మిల్‌ను అరెస్టు చేసి విచారించినప్పుడు మొదటిసారిగా ఇష్తియాక్‌ పేరు బయటపడింది. ముజమ్మిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్‌లోని అద్దె ఇంటిపై దాడి చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలకు సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటి యజమాని, హర్యాణా మేవాత్‌కు చెంద...
TIMS Hospitals | రేవంత్‌ రెడ్డివి మాటలు మాత్రమే… పనులు శూన్యం
State, Hyderabad

TIMS Hospitals | రేవంత్‌ రెడ్డివి మాటలు మాత్రమే… పనులు శూన్యం

టిమ్స్ ఆసుపత్రులపై హరీశ్‌రావు ఫైర్: సనత్‌నగర్ టిమ్స్ హాస్పిట‌ల్ (TIMS Hospitals) నెల రోజుల్లోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రకటించి నేటితో ఒక నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రకటించిన తేదీకి ఆసుపత్రి తెరుచుకుంటుందా? లేక ఎప్పటిలాగే కొత్త డేట్ పెట్టేసుకుంటారా? అని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. కోతల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సొంత డ‌ప్పు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చి సేవ‌లందించ‌డంలో మీరు చేస్తున్న కృషి శూన్యమని సీఎం రేవంత్‌ రెడ్డిని హరీశ్‌రావు విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే ఓ సినిమాలో తనికెళ్ల‌ భరణి చెప్పే కవిత్వం లాగ...
Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..
State, Hyderabad

Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..

తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది.. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో కొత్త జాబితా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. TPCC నూతన అధ్యక్షుల జాబితా : ఆదిలాబాద్: డా. నరేష్ జాదవ్ (Dr. Naresh Jadhav) ఆసిఫాబాద్: శ్రీమతి ఆత్రం సుగుణ (Athram Suguna) భద్రాద్రి కొత్తగూడెం: శ్రీమతి తోట దేవి ప్రసన్న (Thota Devi Prasanna) భువనగిరి: బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) గద్వాల: ఎం. రాజీవ్ రెడ్డి (M. Rajeev Reddy) హన్మకొండ: ఎంగల వెంకట్రామ్ రెడ్డి (Engala Venkat Ram Reddy) హైదరాబాద్: సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా (Syed Khalid Saifullah) జగిత్యాల: గాజెంగి నందయ...
Justice Suryakant | సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. 24న స‌రికొత్త త‌ర‌హాలో ప్ర‌మాణ స్వీకారం..
National

Justice Suryakant | సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. 24న స‌రికొత్త త‌ర‌హాలో ప్ర‌మాణ స్వీకారం..

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూత‌న‌ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సోమ‌వారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత CJI, BR గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. అయితే, మొదటిసారిగా, ఆరు దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి భవన్‌లో జరిగే భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. కొత్త CJIగా జస్టిస్ సూర్యకాంత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల నుంచి డజనుకు పైగా న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు హాజరవుతారని బార్ & బెంచ్ నివేదించింది . భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి న్యాయవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంత పెద్ద అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరు కావడం ఇదే మొదటిసారి...
IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ
State, Hyderabad

IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

IPS Transfers | తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్ మైల‌బ‌త్తుల‌, మ‌హేశ్వ‌రం జోన్ డీసీపీగా కే నారాయ‌ణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ ప‌ద్మ‌జ‌, నాగర్‌క‌ర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, మ‌హ‌బూబాబాద్ ఎస్పీగా శ‌బ‌రీష్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖిత‌, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా గిరిధ‌ర్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. ఇక హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభ‌వ్, ములుగు ఎస్పీగా కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ఎస్పీగా సంకీర్త్, గ‌వ‌ర్న‌ర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌, పెద...
error: Content is protected !!