Sarkar Live

Privacy Policy

Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?
Special Stories

Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?

జిల్లాలోని ఉప్పరపల్లిలో గల సాయిరాం రైస్ మిల్లులోని ధాన్యం నిల్వల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం వచ్చిన ధాన్యం నిల్వలలో భారీ తేడాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 32 ఏసీకేల (ACKs) ధాన్యంలో సగానికి పైగా మాయమైనట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై బుధవారం"సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో సర్కారు ధాన్యం భద్రమేనా" అనే కథనాన్ని సర్కార్ లైవ్ ప్రచురించింది. అయితే ఈ మిల్లులోని ధాన్యం నిల్వల లెక్కలు తేల్చేందుకు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి రంగంలోకి దిగుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది.. ​Rice Mill Scam : అసలేం జరుగుతోంది? ​గత కొంతకాలంగా ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, నివేదికల్లో చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు సగానికి పైగా ధాన్యం నిల్వలు మిల్లులో భౌతికంగా లేవని, వాటిని పక్కదారి పట్టి...
తెలంగాణలో పరిషత్ ఎన్నికల హడావుడి.. సీఎం రేవంత్ కీలక సంకేతాలు – MPTC ZPTC elections
State

తెలంగాణలో పరిషత్ ఎన్నికల హడావుడి.. సీఎం రేవంత్ కీలక సంకేతాలు – MPTC ZPTC elections

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ MPTC ZPTC elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ కదలికలు వేగం పెంచుకున్నాయి. మండల పరిషత్ (MPTC), జిల్లా పరిషత్ (ZPTC) ఎన్నికలను మే నెల చివర్లో లేదా జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఈ మేరకు పీసీసీకి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఎన్నికల టైమింగ్‌పై క్లారిటీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ఉండటంతో ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికలపై ముందడుగు వేయలేదు. అదనంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగియనున్న నేపథ్యంలో మే చివర్లో లేదా జూన్ ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించడం అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. MPTC ZPTC elections : క్యాడర్‌ను అలర్ట్ చేస్తున్న పీసీసీ ఈ ఎన్నిక...
వరంగల్ ప్రగతి రథ సారథి: కలెక్టర్ సత్య శారద మార్క్ పాలన!
State

వరంగల్ ప్రగతి రథ సారథి: కలెక్టర్ సత్య శారద మార్క్ పాలన!

పాలన అంటే కేవలం సంతకాలు, సమీక్షలు మాత్రమే కాదు.. ప్రజల గుండె చప్పుడిని వినడం అని నిరూపిస్తున్న వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పై "సర్కార్ లైవ్" ప్రత్యేక కథనం.బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే జిల్లాలో తనదైన ముద్ర వేస్తూ, జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారు. ​ప్రజల ముంగిటకే పాలన: 'ప్రజావాణి'కి కొత్త ఊపిరి ​సాధారణంగా కలెక్టరేట్ అంటే సామాన్యుడికి ఒక భయం ఉంటుంది. కానీ సత్య శారద గారు ఆ పరిస్థితిని మార్చేశారు. ప్రతి వారం నిర్వహించే 'ప్రజావాణి'లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల గోడును ఆమె స్వయంగా వింటున్నారు. ఫిర్యాదులను కేవలం స్వీకరించి పక్కన పెట్టకుండా, అక్కడికక్కడే అధికారులను ఆదేశించి సమస్య పరిష్కారానికి మార్గం చూపుతున్నారు. ​ విద్యా, వైద్య రంగాల్లో క్షేత్రస్థాయి మార్పులు ​జిల్లాలో విద్య మరియు వైద్యం మెరుగుపడటమే లక్ష్యంగా ఆమె అకస్మిక ...
రైతు వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ సమరభేరి: వరంగల్‌లో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభం
warangal

రైతు వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ సమరభేరి: వరంగల్‌లో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రోషిని ఆదేశాలతో  ​వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దిలీప్ రాజ్ నేతృత్వంలో వరంగల్ పోచంమైదాన్ సెంటర్ లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.దేశవ్యాప్తంగా రైతులను నష్టపరిచే విధంగా మోడీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. ​రైతులకు న్యాయం జరిగే వరకు, వారి హక్కులను కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ మరియు యువజన విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా రైతుల గొంతును ప్రభుత్వానికి వినిపిస్తామని...
Road Accident మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ముగ్గురు బలి!
Crime

Road Accident మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ముగ్గురు బలి!

ఒక తాగుబోతు డ్రైవర్ సృష్టించిన బీభత్సం (Road Accident) మూడు కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చింది. సాగర్ రోడ్డులోని హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. భవిష్యత్తుపై ఎంతో ఆశలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వంద మీటర్ల మేర ఈడ్చుకెళ్లి.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వస్తున్నాడు. హస్తినాపురం వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయిన కారు మొదట ఒక ద్విచక్ర వాహనాన్ని, ఆపై రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మరో యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బాధితులు కారు కింద చిక్కుకోగా, వారిని సుమారు 100 మీటర్ల మేర అలాగే ఈడ్చుకెళ్లింది. చివరకు కారు పల్టీ కొట్టడంతో వాహనం ఆగిపోయింది. Road Accident : మృతుల వి...
error: Content is protected !!