ISRO NVS 02 | మొరాయించిన ఉపగ్రహం.. ఇస్రోకు ఊహించని సవాళ్లు
ISRO NVS 02 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO ) జనవరి 29, 2025న తన 100వ ప్రయోగంగా జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-2 (GSLV Mk-II) ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది NavIC (Navigation with Indian Constellation) వ్యవస్థలో కీలక ఉపగ్రహం. అయితే.. ఇస్రోకు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం విఫలమైంది.
కక్ష్యలోకి ప్రవేశించని NVS-02
NVS-02 ఉపగ్రహాన్ని భారతదేశ సొంత నావిగేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించారు. ముఖ్యంగా రక్షణ, ఆర్థిక, కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ, వ్యవసాయ రంగాలకు కీలకమైన సమాచారాన్ని అందించే సామర్థ్యం ఇందులో ఉంది. ఈ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించలేకపోవడంతో ఈ ప్రయోజనాలపై అస్పష్టత ఏర్పడింది.
NVS-02 అసలు సమస్య ఏమిటి?
ISRO NVS 02 ఉపగ్రహాన్ని నిర్దే...




