Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..
Ipl 2025 News : యూఏఈలోని అబుదాబి వేదికగా ఎంతో ఉత్తేజభరితంగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం ముగిసింది. ఈసందర్భంగా వివిధ ఫ్రాంఛైజీలు భారత క్రికెటర్లను కోట్లు కుమ్మరించి కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు భారీగా ధరలు పలికారు. కాగా, 2008 నుంచి ఐపీఎల్ వేలం జరుగుతుండగా.. 16 ఏళ్ల వేలం రికార్డ్స్‌ను ఐపీఎల్ 2025 వేలం బ్రేక్ చేసింది.
టాప్ వన్ పంత్, టాప్- 2 శ్రేయాస్
ఐపీఎల్ యాక్షన్ లో అత్యధిక డిమాండ్ ఉన్న ఆటగాళ్ల లిస్ట్ లో సగం మందికి పైగా టీమిండియా క్రికెటర్లే ఉన్నారు. అంతేకాకుండా మొదటి రెండు స్థానాల్లోనూ భారత ఆటగాళ్లే ఉన్నారు. గతేడాది వరకూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. గత ఆదివారం ఐపీఎల్ 2025 వేలంలో రూ.27 కోట్లకి రిషబ్ పంత్ అమ్ముడుపోయి ఆ రికార్డ్‌ను బద్ధలు కొట్టాడు.
అయ్యర్ కు ఒక్కసారిగా క్రేజ్.....