Sarkar Live

Privacy Policy

CM Revanth Reddy : సింగ‌పూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ
State

CM Revanth Reddy : సింగ‌పూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి సింగ‌పూర్‌, దావోస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. ముందుగా ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న సింగపూర్ (Singapore)లో సాగింది. ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్ట‌ర్ వివియన్ బాలకృష్ణన్ (Vivian Balakrishnan)ను ఆయ‌న క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వీరి మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. తెలంగాణ‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవన కార్యక్రమాలు, ప‌ర్యాటక రంగ అభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధికి పెట్టుబ‌డులు, వ‌న‌రుల‌పై ఈ స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు. విస్తృత చర్చలు జ‌రిపాం: సీఎం రేవంత్‌ సింగ‌పూర్ విదేశాంగ మంత్రి (Foreign Affairs Minister of Singapore) వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మ‌...
RTA Corruptions : లంచం కొట్టు లైసెన్స్ పట్టు..?
Special Stories

RTA Corruptions : లంచం కొట్టు లైసెన్స్ పట్టు..?

"అలీ" వ్యూహంతో వసూళ్ల జాతరలో చిందులేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు..? నిబంధనలకు పాతర.. వసూళ్ల జాతర.. బరితెగించిన ఎంవీఐ లు… ?చేతులెత్తేసిన ఉన్నతాధికారి ..? ఏసీబీ నజర్ వేస్తే తప్ప వసూళ్లు ఆగేలా లేవట.. RTA Corruptions : రండి బాబు.. రండి మాకు కావాల్సింది సమర్పించుకోండి మీ పనులను సులువుగా చేసుకోండి. మా దగ్గర నిబంధనలతో పని ఉండదు అడిగేవారు అసలే లేరు. మీకు లర్నింగ్ లైసెన్స్ కావాలా? పర్మినెంట్ లైసెన్స్ కావాలా? ఇంకేమైనా సేవలు కావాలా మా ప్రైవేట్ అసిస్టెంట్ ని కలవండి ఈజీగా లైసెన్స్ పొందండి అనే రీతిలో హన్మకొండ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వ్యవహరిస్తున్నారని జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో వసూళ్ల జాతర నడుస్తోందట, ఆ కార్యాలయంలో రవాణా శాఖ నిబంధనలు పాతరేసి వసూళ్ల జాతరలో ఎంవీఐ లు నిమగ్నమయ్యారని విశ్వసనీయంగా తెలుస్తోంది. RTA Corruptions : ల...
Vijay Sethupathi : మక్కల్ సెల్వన్ కొత్త సినిమా గ్లింప్స్
Cinema

Vijay Sethupathi : మక్కల్ సెల్వన్ కొత్త సినిమా గ్లింప్స్

Kollywood : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఇన్వాల్ అయిపోతారు. ఒక సినిమాలో తండ్రి పాత్రలో మెప్పించగలడు.. అలాగే విలన్ పాత్రలో అలరించగలడు.. అలాగే హీరోగా లుక్ మార్చుకొని ఇరగోట్టగలడు. ఎటువంటి పాత్రనైనా చేసి ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. ఆయన తాజా చిత్రం ఏస్ (Ace) గ్లింప్స్ ను తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అరుముగా కుమార్ ( Arumuga kumar) డైరెక్షన్లో సెవెన్ సీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు మాస్ ఎలివేషన్స్ తో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ ఉండబోతుందని గ్లింమ్స్ చూస్తే అర్థమవుతుంది. రుక్మిణి వసంత్, యోగిబాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మహారాజ తర్వాత వస్తున్న మూవీ కావడంతో విజయ్ సేతుపతి ఖాతాలో మరో హిట్టు చేరుతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. గ్లింప్స్ లో ఆయన స్టైలిష్ లుక్ ...
White House : అమెరికాలో తెలుగోడికి జైలు శిక్ష‌.. కేసు ఏమిటంటే..
World

White House : అమెరికాలో తెలుగోడికి జైలు శిక్ష‌.. కేసు ఏమిటంటే..

అమెరికాలోని అధ్య‌క్ష భ‌వ‌నం వైట్‌హౌస్ (White House)పై దాడి య‌త్నం కేసులో తెలుగు సంత‌తికి చెందిన 20 ఏళ్ల యువ‌కుడు సాయి వ‌ర్షిత్ కందుల (ai Varshith Kandula)కు అక్క‌డి ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ల జైలు శిక్ష‌ను విధించింది. నాజీ సిద్ధాంతాల‌కు ప్రేరేపితుడైన అత‌డు అమెరికా ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ దాడి చేశాడ‌ని నిర్ధార‌ణ కావ‌డంతో ఈ శిక్ష‌ణు విధిస్తున్నామ‌ని అక్క‌డి న్యాయ‌స్థానం పేర్కొంది. సాయి వర్షిత్ కందుల హైద‌రాబాద్ (Hyderabad)లోని చంద్రాన‌గ‌ర్ ప్రాంతానికి చెందినవాడు. అమెరికా ( America White House )లో అతడు గ్రీన్ కార్డ్ హోల్డ‌ర్‌. కేసు పూర్వ‌ప‌రాలు కోర్టులో స‌మ‌ర్పించిన ప‌త్రాల వివ‌రాల ప్ర‌కారం… 2023 మే 22న సాయంత్రం సాయి వర్షిత్ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డిసి (Washington DC) వెళ్లాడు. సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో డల్లస్ అంతర...
SCR Special Trains | చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు
State

SCR Special Trains | చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు

SCR Special Trains | సంక్రాంతి సెలవులు ముగియ‌డంలో స్వగ్రామాలకు వెళ్లిన వారంద‌రూ తిరిగి హైదరాబాద్‌కు తిరుగు పయాణయ్యారు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దృష్ట్యా విశాఖపట్నం నుంచి కొత్త ప్రారంభించిన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌కు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపిస్తోంది. ఈ రైళ్లు ఈనెల 18, 19వ‌ తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయ‌ని అధికారులు తెలిపారు. విశాఖ-చర్లపల్లి-భువనేశ్వర్‌ (08549/08550) విశాఖ-చర్లపల్లి-భువనేశ్వర్‌ రైలు 18వ తేదీ రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 19న ఉదయం 7 గంటలకు చర్లపల్లి స్టేష‌న్‌కు చేరుతుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు చర్లపల్లిలో స్టార్ట్ అయి సాయంత్రం 7.30 గంటలకు వైజాగ్ కు చేరుకుంటుంది. 7.50 గంటలకు బయలుదేరి ఈ నెల 20న తెల్లవారుజామున 2.15 గంటలకు ఒడ...
error: Content is protected !!