Engineering Education : ఇంజినీరింగ్ కోర్సులు మాకొద్దంటున్న విద్యార్థులు.. కారణాలేంటీ?
Engineering Education : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ తగ్గుతోంది. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ విద్యా సంవత్సరానికి ( 2024-25) మేనేజ్‌మెంట్ కోటా కింద 6 వేల సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
10 కాలేజీల్లో భర్తీకాని అడ్మిషన్లు
తెలంగాణలో మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలు (Engineering Colleges) ఉన్నాయి. వీటిలో 1.08 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా 36 వేల సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద ఉంటాయి. ఇప్పటి వరకు 30 వేల సీట్లు భర్తీ అయినప్పటికీ ఇంకా 6 వేలు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 10 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఒక్క అడ్మిషన్ కూడా భర్తీ కాలేదు. ఈ కాలేజీలు అధికంగా B-కేటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) అడ్మిషన్లపై ఆధారపడటం వల...




