Sarkar Live

Privacy Policy

మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
warangal

మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేటలోని ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో చర్చి నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ నగరం మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దమని కొనియాడారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులంతా కలిసిమెలసి ఉండటమే ఈ ప్రాంత ప్రత్యేకతని, ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. భక్తులందరికీ ఫాతిమా మాత ఆశీస్సులు లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబూబకర్, సీనియర్ నాయకులు ఎస్.టి. పాల్ ఆనంద్, విశ్రాంత బిషప్ జోసెఫ్, ఫాదర్ విజయపాల్, చర్చి గురువులు మర్రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు....
Land Encroachment | సర్కారు దారినే మింగేసి వెంచర్..
Special Stories

Land Encroachment | సర్కారు దారినే మింగేసి వెంచర్..

పైడిపల్లి రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 704 లోని రోడ్డునే మింగేసిన రియల్ మాఫియా.. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల కళ్ళు 'మూయించారా'..? ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ - కొత్తపేట మార్గంలో 10 ఎకరాల్లో 81 ప్లాట్ల తో వెంచర్ Warangal Paidipalli Land Encroachment రియల్ ఎస్టేట్ మాఫియా ఆకలికి హద్దు అదుపు లేకుండా పోతోంది. భూమి కనిపిస్తే చాలు ‘నాది’ అని బోర్డు పెట్టేసే అక్రమార్కులు, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ దారినే మింగేస్తున్నారు. పైడిపల్లి రెవెన్యూ శివారులో వెలిసిన ఒక వెంచర్ నిర్వాహకుల బరితెగింపు ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. సర్వే నంబర్ 704లో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న రోడ్డును సైతం ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నా, అటు రెవెన్యూ.. ఇటు మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ - కొత్తపేట మార్గంలో భూదందా!...
పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
warangal

పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యమైన వివరాలు: పరీక్షా కేంద్రాలు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 150 కేంద్రాలు (హన్మకొండ-64, వరంగల్-47, జనగామ-39). సమయం: ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమలు కాలం: ఏప్రిల్ 16, 2026 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. విధించిన ఆంక్షలు: . పరీక్ష కేంద్రాల సమీపంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం ఉంది. . ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా ధర్నాలకు అనుమతి లేదు. .పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను ప్ర...
నిజామాబాద్‌లో పొలిటికల్ వార్: కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య! – Nizamabad Murder case
Crime

నిజామాబాద్‌లో పొలిటికల్ వార్: కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య! – Nizamabad Murder case

Nizamabad : జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు చివరకు రక్తపాతానికి దారితీయడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారుతో గుద్ది.. కత్తితో పొడిచి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా (Nizamabad ) ఇందల్వాయి మండల కేంద్రంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఇమ్మడి గోపీపై ఆయనకు బంధువైన సతీశ్‌ పక్కా ప్లాన్‌తో దాడి చేశాడు. తొలుత గోపీని తన కారుతో బలంగా ఢీకొట్టి కింద పడేశాడు. ఆ వెంటనే తేరుకునే లోపే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన గోపీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హత్య చేసిన అనంతరం నిందితుడు సతీశ్‌ నేరుగా పోలీస్ స్ట...
Kothapeta Land Scam | వరంగల్ 3వ డివిజన్‌లో భూ బాగోతం
State

Kothapeta Land Scam | వరంగల్ 3వ డివిజన్‌లో భూ బాగోతం

సర్కారు బాటను మాయం చేసి లేఅవుట్! కొత్తపేటలో రియల్ ఎస్టేట్ 'మాయా' జాలం .. Kothapeta Land Scam | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కొత్తపేటలో భూ డెవలపర్లు బరితెగించారు. సామాన్యులకు అందని చట్టాలు తమకు చుట్టాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఏకంగా ప్రభుత్వ రోడ్డునే మాయం చేశారు. పబ్లిక్ వినియోగంలో ఉండాల్సిన బాటను వెంచర్‌లో కలిపేసి, అదే ప్రభుత్వం నుండి లేఅవుట్ అనుమతులు పొందడం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.3 వ డివిజన్ కొత్తపేట ప్రాంతంలోని సర్కారు రోడ్డుకు కొందరు రియల్టర్లు ఎసరు పెట్టారు. నిబంధనల ప్రకారం వదిలిపెట్టాల్సిన ప్రభుత్వ పానాదిని (బాటను) కబ్జా చేసి, పక్కా ప్లాన్‌తో వెంచర్‌ (Kothapeta Land Scam )గా మార్చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్డును రికార్డుల్లో మాయం చేయడమే కాకుండా, అధికారుల కళ్లు గప్పి లేదా వారి సహకారంతోనే ఈ అక్రమ లేఅవుట్‌కు అనుమతులు సాధించినట్లు ఆర...
error: Content is protected !!