హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం – తెలంగాణకు కేంద్రం భారీ కేటాయింపులు – Telangana Highways
Telangana Highways | రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను హ్యామ్ (HAM )విధానంలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమితిచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,661 కోట్ల నిధులను జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 431 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ పద్దతిలో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు 40:60 నిష్పత్తిలో నిధులు ఖర్చును పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో 124 జాతీయ రహదారులను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. రూ.3,45,466 కోట్లతో 6,376 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసి చేపట్టే ఈ రహదారుల నిర్మాణాల తాత్కాలిక జాబితాలో రాష్ట్రానికి చెందిన ఐదు జాతీయ రహదారులకు చోటు దక్కడం విశేషం.
Telangana Highways : రాష్ట్రానికి లభించిన ప్రధాన ప్రాజెక్టుల...




