Sarkar Live

Privacy Policy

కొమ్మాల అంగడిలో వసూళ్ల పర్వం: రైతుల జేబుకు చిల్లు.. కాంట్రాక్టర్ల జేబులు ఫుల్!  Kommala Cattle Market Scam
Special Stories

కొమ్మాల అంగడిలో వసూళ్ల పర్వం: రైతుల జేబుకు చిల్లు.. కాంట్రాక్టర్ల జేబులు ఫుల్! Kommala Cattle Market Scam

​వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలోని కొమ్మాల అంగడి (Warangal Kommala Cattle Market) లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వసూళ్లు చర్చనీయాంశంగా మారాయి. అంగడికి వచ్చే అమాయక రైతుల నుంచి కాంట్రాక్టర్లు డబుల్ వసూళ్లకు పాల్పడుతూ వారి జేబులకు చిల్లు పెడుతున్నారు. అధికారికంగా ఉండాల్సిన ఫీజుల కంటే రెట్టింపు వసూలు చేస్తూ, కాంట్రాక్టర్లు కాసుల వేటలో పడ్డారు. ​Kommala Cattle Market : నిబంధనలు గాలికి.. వసూళ్లు జోరుగా.. ​సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు రుసుము చెల్లించి రైతులు తమ పశువులను అంగడిలో విక్రయించుకోవాలి. కానీ, కొమ్మాల అంగడిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయించి, రైతుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు. ​అధికారుల మౌనం.. లోపాయకారి ఒప్పందం...
గ్రేహౌండ్స్ ఆపరేషన్లపై డీజీపీ సివి ఆనంద్ కీలక ఆదేశాలు- DGP CV Anand Greyhounds Review
State, Hyderabad

గ్రేహౌండ్స్ ఆపరేషన్లపై డీజీపీ సివి ఆనంద్ కీలక ఆదేశాలు- DGP CV Anand Greyhounds Review

రాష్ట్ర పోలీస్ శాఖలో అత్యంత కీలకమైన మరియు విశిష్టమైన విభాగమైన గ్రేహౌండ్స్ కార్యకలాపాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్ గురువారం సమగ్ర సమీక్ష (DGP CV Anand Greyhounds Review) నిర్వహించారు. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ, ప్రస్తుత ఆపరేషన్లు మరియు పరిపాలనాపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శిక్షణలో ఆధునీకరణే కీలకం మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో గ్రేహౌండ్స్ ప్రదర్శిస్తున్న అసాధారణ తీరును అధికారులు డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా సిబ్బంది నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు డీజీపీ పలు సూచనలు చేశారు: ఆధునీకరణ: మారుతున్న కాలానికి మరియు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శిక్షణా ప్రమాణాలు, పాఠ్యాంశాలు మరియు మాడ్యూల్స్‌లో నిరంతరం ఆధునీకరణ ఉండాలని స్పష్టం చేశారు. ఫైరింగ్ ప్రాక్టీస్: క్షేత్రస్థాయిలో సిబ్బందికి క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస...
ACB Raids | ​రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ (RI)
State

ACB Raids | ​రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ (RI)

●తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు: వారసత్వ భూమి పట్టా కోసం డిమాండ్! ​అసలేం జరిగిందంటే? వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ​మధిర గ్రామానికి చెందిన లోల్లాటి రాజు అనే వ్యక్తి, తన తండ్రి నర్సయ్య మరణానంతరం ఆయన పేరు మీద ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చుకోవాలని (వారసత్వ నమోదు) దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ఫైల్‌ను క్లియర్ చేసి పట్టా ఇచ్చేందుకు సంబంధిత ఆర్‌ఐ రూ. 10 వేల లంచం డిమాండ్ చేశారు. ​పక్కా ప్లాన్‌తో పట్టుకున్న అధికారులు ​లంచం ఇవ్వడం ఇష్టం లేని రాజు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలోనే రాజు నుంచి ఆర్‌ఐ లంచం తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి, ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ​ఆర్‌ఐ వద్ద నుంచి లంచం సొమ్మున...
ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు: ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
State

ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు: ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్

ఆటోలో ప్రయాణించే అమాయక ప్రయాణికులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, బెదిరించి నగదు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల  ముఠాను గీసుగొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ఆటో, 5 సెల్‌ఫోన్లు మరియు రూ.15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్ గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ​ఘటన నేపథ్యం.. ​ఈ నెల 3వ తేదీన నమోదైన ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 30న వరంగల్‌కు చెందిన విద్యార్థి పెరుమాండ్ల సిద్ధార్థ తన స్నేహితుడితో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లేందుకు కోటగండి మైసమ్మ వద్ద ఆటో కోసం వేచి ఉన్నాడు. ఆటో డ్రైవర్ సాయికుమార్ తన ముఠాతో కలిసి, గిర్నీబావి వద్ద దింపుతామని నమ్మించి వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం గంగాదేవిపల్లి గ్రామ శ్మశాన వాటిక సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, సిద్ధార్థ వద్ద ఉన్న రూ...
కేరళ సీఎంగా వి.డి. సతీషన్: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం
State

కేరళ సీఎంగా వి.డి. సతీషన్: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం

కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్ అధిష్టానం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వి.డి. సతీషన్‌ (V.D. Satheesan) ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. గత పది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలుకుతూ, పార్టీ అధిష్టానం సతీషన్ వైపే మొగ్గు చూపింది. ​అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కె.సి. వేణుగోపాల్ ​ఈ పదవి కోసం రేసులో ఉన్న మరో కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, పార్టీ నిర్ణయంపై స్పందించారు. సతీషన్ ఎంపిక పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. "అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తాను. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విజయవంతం కావడానికి నా వంతు సహకారం అందిస్తాను" అని ఆయన ప్రకటించారు. ​ ​సుదీర్ఘ కసరత్తు..  సతీషన్ వైపే మొగ్గు.. కేరళ ఎన్నికల్లో యుడిఎఫ్ (UDF)...
error: Content is protected !!