Sarkar Live

Privacy Policy

TSRTC : ఆర్టీసీ ఐటీఐ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్
career

TSRTC : ఆర్టీసీ ఐటీఐ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్

Hyderabad | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 2025–26 విద్యా సంవత్సరానికి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు TSRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌ శివారులోని హకీంపేట్‌లో ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులను టీఎస్​ ఆర్టీసీ ఆహ్వానిస్తోంది. ఎనిమిది, పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కాలేజీలో మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌, మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రేడ్‌లలో కోర్సులు అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీలోగా టీఎస్​ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 9100664452, 6302649844, 040-69400000 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలి. ఈ మేరకు టీజీఎ...
Allu Arjun | జయం మూవీని బన్నీ చేసుంటే ఎలా ఉండేది? చిన్నికృష్ణ కామెంట్స్ వైరల్
Cinema

Allu Arjun | జయం మూవీని బన్నీ చేసుంటే ఎలా ఉండేది? చిన్నికృష్ణ కామెంట్స్ వైరల్

మూవీ ఇండస్ట్రీ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం మామూలే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun)నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పుష్ప 2 (Pushpa 2) మూవీ కలెక్షన్లు అయితే ఇండియన్ సినిమా లో టాప్ 2 లో ఉంది. దాదాపు 1800 కోట్ల వసూళ్లు రాబట్టి తన రేంజ్ ను పాన్ ఇండియన్ లెవల్లో పెంచుకున్నాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో తన ఫస్ట్ మూవీకి భారీ ఎత్తున అనౌన్స్ చేశాక ఆ మూవీలో మరో హీరో యాక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్టార్ రైటర్ చిన్నికృష్ణ (Chinni krishna) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగోత్రి (gangotri)మూవీ కంటే ముందు జరిగిన విషయాలను చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. మెగా బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (ashvinidat)ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేశారట. ఆ పార్టీకి చిన్నికృష్ణ కూడా వెళ్ళాడట. అక్కడ తేజ (Teja)డైరెక్షన్ లో అల్లు అర్జున...
Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Hyderabad, State

Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో వరదల నివారణకు ‘మూసీ పునరుజ్జీవనమే’ మంత్రం హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం తగ్గించేందుకు సీఎం ప్రత్యేక ప్రణాళిక మూసీకి అనుసంధానం – చెరువులు, కుంటలు, నాలాల కలయికతో నగర భద్రత Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేలా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Ravanth Reddy) ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్ర...
Murder | ఇద్దరు మహిళల దారుణ హత్య
Crime

Murder | ఇద్దరు మహిళల దారుణ హత్య

Janagama : జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్య (Murder )కు గురికావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి (75), కుమార్తె (45)ను దుండగులు హత్య చేసి పారిపోయారు. జఫర్‌గఢ్‌ మండలం తుమ్మడపల్లి ఐ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది....
Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
State, warangal

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం! మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క‌సారిగా మంటలు (Fire Accident) చెల‌రేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు ప‌రుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొంద‌రు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది. కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రక...
error: Content is protected !!