Sarkar Live

Privacy Policy

ఆవుకు అంత్య‌క్రియలు.. శ‌భాష్ అనిపించుకున్నపోలీసులు – Hyderabad Traffic Cops
State, Hyderabad

ఆవుకు అంత్య‌క్రియలు.. శ‌భాష్ అనిపించుకున్నపోలీసులు – Hyderabad Traffic Cops

Cow’s Last Rites: హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Cops) త‌మ సామాజిక బాధ్య‌త‌ను (social responsibility) చాటుకున్నారు. మృతి చెందిన ఆవుకు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా అంత్యక్రియ‌లు (Cow’s Last Rites) నిర్వహించారు. ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వెస్లీ, మొబైల్ కానిస్టేబుల్ టి. సురేష్ డ్యూటీలో ఉన్న సమయంలో బోయిన్‌పల్లి సెంట‌ర్‌లో రోడ్డుపై చ‌నిపోయి ఉన్న ఆవు కనిపించింది. దీంతో వారిద్ద‌రు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ట్రాఫిక్‌ను క్ర‌బ‌ద్ధీక‌రించారు. సొంత ఖ‌ర్చుతో అంత్య‌క్రియ‌లు పోలీసులు కాంటోన్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతో జేసీబీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆవు మృతదేహాన్ని త్రిముల్‌ఘెర్రీలోని గాంధీ కమ్యూనిటీ హాల్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద గుంత తవ్వించి సమాధి చేశారు. ఈ అంత్యక్రియల (final rites)కు సంబంధించిన ఖర్చును స్వయంగా ఆ ఇద్దరు అధికారులే భరించారు. Hydera...
TGSRTC job notification | యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీలో ఉద్యోగావ‌కాశం
Career

TGSRTC job notification | యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీలో ఉద్యోగావ‌కాశం

TGSRTC job notification 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో కొత్తగా ఉద్యోగాల నియామ‌కాల‌కు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 1,743 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ పూర్తి చేసిన యువ‌త ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 2025 అక్టోబ‌రు 8 నుంచి అక్టోబ‌రు 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని TGSRTC త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.. TGSRTC job notification 2025 : డ్రైవర్ పోస్టుల వివరాలు పోస్టుల సంఖ్య : 1000 వయో పరిమితి : కనీసం 22 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు ఉండాలి. విద్యార్హత : కనీసం ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యుండాలి. ఇత‌ర అర్హతలు: హేవీ ప్యాసింజ‌ర్ మోటార్ వెహికిల్ (HPMV) లేదా హేవీ గూడ్స్ వెహికిల్ (HGV) లైసెన్స్ లేదా సరైన ట్రాన్స్‌ప...
Hyderabad | వ‌ర‌ద‌ ప్ర‌వాహంలో గ‌ల్లంతై యువ‌కుడి మృతి
State, Hyderabad

Hyderabad | వ‌ర‌ద‌ ప్ర‌వాహంలో గ‌ల్లంతై యువ‌కుడి మృతి

Hyderabad rains : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం మరో ప్రాణాన్ని బలిగొంది. ముషీరాబాద్‌కు చెందిన యువ‌కుడు నిన్న అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గాలింపు అనంతరం అతడి మృతదేహాన్ని ఈరోజు ఉదయం బాల్కంపేట్ రైల్వే అండర్‌బ్రిడ్జ్ వద్ద పోలీసులు గుర్తించారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే.. బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో షరీఫుద్దీన్ (27) తన బైక్‌పై బాల్కంపేట్ నుంచి బేగంపేట్ వైపు వెళ్లాడు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లు మొత్తం నీళ్లు ముంచెత్తాయి. బలమైన నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక వాహనం సహా ష‌రీఫ్ కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు రాత్రంతా గాలింపు చేపట్టినా ఆచూకీ ల‌భించ‌లేదు. చివరికి గురువారం ఉదయం అతడి మృతదేహం బాల్కంపేట్ అండర్‌పాస్ దగ్గర లభించింది. Hyderabad లో వ‌ర్ష‌పాతం ఇలా.. బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంపై ఒక్కసారిగా భారీ వర్షం కు...
Miryalaguda : పెళ్లి రిసెప్ష‌న్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఆర్థిక సాయం
State, Nalgonda

Miryalaguda : పెళ్లి రిసెప్ష‌న్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఆర్థిక సాయం

Miryalaguda MLA : ఎంతో ముచ్చ‌ట‌ప‌డి కొడుకు పెళ్లి చేశారాయ‌న‌. బంధుమిత్రులను ఆహ్వానించి అత్యంత వైభ‌వంగా రిసెప్ష‌న్ (marriage reception)ను అరేంజ్ చేద్దామ‌ని ఉన్నా ఆ కోరిక‌ను అంత‌టితోనే తుంచేశారు. రిసెప్ష‌న్‌కు అయ్యే ఖ‌ర్చును ఆదా చేసి రైతుల‌కు యూరియా కోసం సాయం చేశారు. మిర్యాల‌గూడ ఎమ్మెల్యే బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి (Miryalaguda MLA Battula Laxma Reddy) చాటుకున్న దాతృత్వం ఇది. ఆర్భాటాలు వ‌ద్ద‌నుకొని అన్న‌దాత‌కు ఆస‌రా ఎమ్మెల్యే బ‌త్తుల లక్ష్మా రెడ్డి త‌న కుమారుడు సాయి ప్రసన్న‌(Sai Prasanna) కు భవ్యమైన వివాహ విందును ఏర్పాటు చేయాలని ముందుగా ప్రణాళికలు వేసుకున్నారు. అయితే.. రైతుల దుర్భర పరిస్థితులు ఆయనను కలచివేశాయి. వర్షాభావం, పెరిగిన ఎరువుల ధరలు, సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన ఆయన, విందు ఖర్చును రైతుల సంక్షేమం కోసం మళ్లించాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్...
ACB raid | ఏసీబీకి చిక్కిన‌ అవినీతి అధికారులు – తహసీల్దార్‌తో పాటు ఇద్దరికి అరెస్ట్
Crime, Khammmam

ACB raid | ఏసీబీకి చిక్కిన‌ అవినీతి అధికారులు – తహసీల్దార్‌తో పాటు ఇద్దరికి అరెస్ట్

Khammam News | ఖ‌మ్మం జిల్లాలో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి (ACB raid) చిక్కారు. రూ.10 వేలు లంచం తీసుకుంటూ తల్లడ( Tallada) మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్ తహసీల్‌ కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ కోసం తల్లడ తహసీల్దార్‌ కార్యాలయానికి వ‌చ్చిన బాధితుడిని అధికారులు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం తహసీల్‌ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేషర్‌ శివాజీ రాథోడ్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న తహసీల్దార్‌ వంకాయల సురేష్‌కుమార్ (Tahasildar) ‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మాలోత్‌ భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీరిని వరంగల్‌ ఏసీబీ కోర్టులో ప్రవేశప్టెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసు విచార‌ణ చేప‌...
error: Content is protected !!