Samyuktha menon Next Movie | టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ,చార్మి ప్రొడ్యూసర్ లుగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై (Puri Connects Banner)ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ బ్యానర్ పై వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ రెండు భారీ ఫ్లాప్స్ అయ్యాయి.
పవర్ ఫుల్ స్టోరీ తో రెడీ…?
ఇక ఇండస్ట్రీ లో పూరి పని అయిపోయిందనుకున్నారు. కానీ పూరి అనూహ్యంగా విజయసేతుపతిని లైన్ లో పెట్టాడు. ప్రజెంట్ సిట్చువేషన్ లో విజయ్ సేతుపతి డేట్స్ దొరకాలంటే చాలా కష్టం. రెండు మూడు సంవత్సరాలకు పైగా ఆయన బిజీ గా ఉండే యాక్టర్. అటువంటిది విజయ్ సేతుపతి కి కథ చెప్పి ఒప్పించాడంటే స్టొరీ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
విజయ్ సేతుపతి కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్ కదా అని డేట్స్ ఇవ్వడు. స్టోరీ లో కొత్తదనం ఉంటేనే ఓకే చెప్తాడు.ఈ క్రేజీ కాంబో సెట్ అయిన దగ్గర నుండి ఇందులో ఎవరెవరు నటిస్తారనే దానిపై ఆడియన్స్ కి క్యూరియాసిటీ పెరిగింది. ఇందులో యాక్ట్ చేస్తున్న వారిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.
Samyuktha menon : తెరపైకి మలయాళీ భామ
ఈ మూవీలో లేటెస్ట్ గా అందాల భామ సంయుక్త యాక్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతకుముందు విజయ్ దునియా, టబు నటిస్తున్నట్టు కూడా తెలిపింది. లేటెస్ట్ గా సంయుక్తను కూడా మూవీలో భాగం చేయడంతో మూవీపై అంచనాలను పెంచేసింది. సంయుక్త మీనన్ (Samyuktha menon)సర్, విరూపాక్ష హిట్టు మూవీలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు స్వయంభు, అఖండ -2తో పాటు మరో రెండు సినిమాలను చేస్తుంది. ఇప్పుడు పూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.
వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్…
జూన్ లేదా జులైలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. భారీ ఫ్లాప్ ల తరవాత ఓ స్టార్ హీరో తో తీయబోతున్న మూవీ కాబట్టి ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మూవీ తీస్తారనడంలో సందేహం లేదు. మళ్ళీ వింటేజ్ పూరీని చూపెట్టాలని ఫాన్స్ కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.