Pushpa 2 Release Date | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2: ది రూల్ వచ్చే వారం విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్‌లలో సందడి చేయనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీకి ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో IMAX స్క్రీన్‌ను కేటాయించారు.
“పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా 12,000+ స్క్రీన్‌లలో విడుదల అవుతుంది. భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక సంఖ్యలో IMAX వెర్షన్‌లో వస్తోంది. సినీడబ్స్ యాప్‌ని ఉపయోగించి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో సినిమాను ఆస్వాదించవచ్చని సినిమా నిర్మాతలు ఇటీవల వెల్లడించారు.
పుష్ప-2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే ఇక దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రం పార్ట్ వన్ 2021లో విడుదలై సంచలనం సృష్టించింది. పుష్ప 2: ది రూల్ లో అల్లు అర్జున్ గంధపు చెక్క స్మగ్లర్ పుష్ప రాజ్‌గా తిరిగి వస్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నవంబర్ మధ్యలో విడుదలైంది. రష్మిక మండన్న శ్రీవల్లి పాత్రలో మళ్లీ నటిస్తుందని, ఫహద్ ఫాసిల్ ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా చూడవచ్చు.
చిత్రం ఈ వారం ప్రారంభంలో సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రంలోని కొన్ని పదాలు, హింసాత్మక సన్నివేశాలను తొలగించమని కోరినట్లు సమాచారం. కాగా, పుష్ప 2 మొదట ఆగస్ట్‌లో విడుదల కావాల్సి ఉండగా వాయిదాలు పడింది. పుష్ప-2 డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.