Pushpa 2 Reloaded : స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లుఅర్జున్ (Allu Arjun). ఆయన లేటెస్ట్ మూవీ పుష్ప-2తో నటుడిగా మరొక మెట్టు ఎక్కారు. పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అయిన పుష్ప-2 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసింది. నెల రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టిన మూవీగా నిలిచింది.
ఇంతకుముందు వచ్చిన పుష్ప-1 మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు కొట్టారు. ఈ మూవీ అంతకంటే రెట్టింపు హిట్ అయింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ఓ లెవల్లో ఉండడంతో ఈసారి కూడా అవార్డు గ్యారెంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
మొదట డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీని ఒకటే పార్ట్ గా తీయాలనుకున్నారు. కానీ ఈ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో స్టోరీ డిమాండ్ మేరకు రెండు పార్ట్ లుగా మారింది. దీంతో అల్లు అర్జున్ దాదాపు ఐదు సంవత్సరాలు తన సమయాన్ని ఈ మూవీకే కేటాయించాల్సి వచ్చింది. కాగా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టై ఐకాన్ స్టార్ కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
3 గంటల 20 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించారు. అంతసేపు ప్రేక్షకులను సీట్లలో కూర్చునేలా సుకుమార్ తన టేకింగ్ తో మ్యాజిక్ చేశాడు. ఈనెల 11 నుంచి మరో 20 నిమిషాల సీన్స్ ని మూవీలో కలిపి ప్రదర్శించేలా కూడా మూవీ మేకర్స్ ఏర్పాటు చేశారు.
Pushpa 2 Reloaded వాయిదాకు కారణం అదేనా?
అయితే ఈ రీలోడెడ్ వర్షన్ (Pushpa 2 Reloaded Version) ని కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 17 నుంచి కొత్త వెర్షన్ ని థియేటర్లలో ప్రదర్శితమయ్యేలా చూస్తామని తెలిపింది. పుష్ప -2 రీలోడెడ్ వాయిదాకు కారణం ఈనెల 10న విడుదలవుతున్న గేమ్ చేంజర్ (Game changer Movie) మూవీనే కారణమని ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి. ఈ 20 నిమిషాల సీన్స్ ని చూడడానికి ఫ్యాన్స్ ఎగబడతారని దానివల్ల గేమ్ చేంజర్ కలెక్షన్స్ తగ్గుతాయనే వాయిదా పడిందంటున్నారు. ఏదేమైనా పుష్ప-2 రీలోడెడ్ వర్షన్ వాయిదా పడి గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ కి ఇబ్బంది లేకుండా చేసిందని చెప్పొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..