Rain Alert in Telangana | ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతోందని ఐఎండీ తెలిపింది. దీనితో పాటు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
శుక్రవారం 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండగా బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, నల్గొండ, మహబూబ్ నగర్, ములుగు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    