IMD Rain Alert to Telangana and AP : బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న (బుధవారం) అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక విషయాలను వెల్లడించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందాఇ. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింంది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, ప్రకాశం, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. రాయలసీమలోని కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain Alert : ఆంధ్రప్రదేశ్ లో..
ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ నదిసంద్రంగా మారింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుని వాహనదారులు నరకం చూశారు. అటు.. రాజమండ్రిలోనూ భారీ వర్షం కురిసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    