Weather News | రాష్ట్రంలో కుండపోత వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అయితే మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయన్న వాతావరణ శాఖ (IMD) హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
తెలంగాణలోని మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    