Jaipur road Accident | జైపూర్‌లోని హర్మాడలో సోమవారం మధ్యాహ్నం ఒక డంపర్ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ముందున్న అనేక వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో సుమారు 19 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఖాళీ డంపర్ రోడ్ నంబర్ 14 నుండి లోహా మండి పెట్రోల్ పంప్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో ఒకదాని తర్వాత ఒకటి వాహనాలను ఢీకొట్టడం ప్రారంభించింది. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ ఉందని, కానీ అకస్మాత్తుగా ఒక డంపర్ మితిమీరిన వేగంతో వచ్చి కారును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వరుసగా మూడు కిలోమీటర్ల మేర ముందున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిందని.తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి విచారం
ఈ సంఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేస్తూ, ఈఘటన ‘చాలా ‘హృదయ విదారకమైనదని అన్నారు. , గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, మరణించినవారిని నివాళులర్పించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








