Coolie Movie Records | సూపర్ స్టార్ రజనీకాంత్(super star Rajnikanth)లేటెస్ట్ మూవీ కూలీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఈనెల 14న రిలీజ్ అయిన మూవీ ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. తలైవా పవర్ ఏంటో బాక్సాఫీస్ కి మరోసారి రుచి చూపించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.
రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 400 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజు(Lokesh kanukaraj) డైరెక్షన్ లో మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన రోజే హృతిక్ ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 కూడా రిలీజ్ అయింది.
రెండిటికీ మిక్స్డ్ టాక్ రాగా.. కూలీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఇప్పటివరకు తను తీసిన సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ మూవీని తెరకెక్కించగా ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ వచ్చింది.
నాగ్ క్యారెక్టర్ ఇంకా బలంగా రాసుంటేనా…
ఇది లోకేష్ కనకరాజు మూవీనే కాదు అనే విమర్శలు కూడా వచ్చాయి. రజినీ తన నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఫ్లాష్ బ్యాక్ లో తన లుక్ తో వింటేజ్ రజనీని గుర్తు తెచ్చాడు. విలన్ క్యారెక్టర్ లను బలంగా రాసుకునే లోకేష్.. కింగ్ నాగార్జున (King nagarjuna)క్యారెక్టర్ వీక్ గా ఉండడంతో మైనస్ గా మారింది. ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. నాగ్ ఫ్యాన్స్ ను లోకేష్ ఏ మాత్రం మెప్పించలే కపోయాడు. అందులో నాగ్ ఫస్ట్ టైం విలన్ రోల్ చేయడం..అంతగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ లో నాగ్ ఎలా నటించాడంటూ ఫ్యాన్స్ నుండి టాక్ కూడా వచ్చింది.
Coolie Movie : రజినీ స్టైల్, సౌబిన్ ఎక్స్ప్రెషన్స్ తో..
ఇక రజినీ స్వాగ్ ఎప్పటిలాగే కంటిన్యూ అవ్వగా.. అనిరుద్ బిజిఎం కొన్ని కొన్ని షాట్స్ ని ఎలివేట్ చేసేలా ఉండడం ప్లస్ గా మారాయి.. ఒక్క మోనికా సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఇక మూవీలో అందరికంటే ఎక్కువ పేరు వచ్చింది మాత్రం సౌబిన్ షాహీర్(soubin shahee), అతడికి భార్యగా యాక్ట్ చేసిన నటికే అని చెప్పొచ్చు. విలన్ గా సౌబిన్ షాహీర్ తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో అందర్నీ తన వైపు తిప్పుకున్నాడు.ఇక తనకి వైఫ్ గా యాక్ట్ చేసిన నటి అమాయకురాలిగా,క్రూరమైన విలన్ గా స్క్రీన్ పై అదరగొట్టారు. ఈ మూవీలో ఇద్దరు క్యారెక్టర్లకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సౌబిన్ షాహీర్ బురదలో నుండి బయటకు వచ్చే సీన్త లో ఎక్స్ప్రెషన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. ఇక మోనిక పాటలో కూడా డాన్స్ తో దుమ్ము దులిపాడు. అడపాదడప సినిమాలతో పేరు తెచ్చుకున్నా యాక్టర్..ఈ మూవీ తర్వాత అన్ని ఇండస్ట్రీలలో తన పేరు మార్మోగింది.
జైలర్ రికార్డులు బద్దలు కొడుతుందా..?
అమీర్ ఖాన్, ఉపేంద్ర రోల్స్ పెద్దగా మూవీకి పెద్దగా ఉపయోగ పడలేదు. స్టోరీ పరంగా ఓకే అనిపించుకున్నా..సెకండాఫ్ స్లో నరేషన్ అనే టాక్ వచ్చింది.ఇలా ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చినా 400 కోట్లలో చేరడం లోకేష్ రజినీ కాంబో వలనే అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేనియా ఇలాగే కంటిన్యూ అయితే జైలర్ రికార్డులు బద్దలవడం ఖాయమంటున్నారు. ఇంకా 1000 కోట్ల క్లబ్బులో చేరినా ఆశ్చర్య పడనక్కర్లేదని చెబుతున్నారు. రజినీ 1000 కోట్ల క్లబ్బులో చేరుతాడు అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








