- రజనీకాంత్ – లోకేష్ కనకరాజు కాంబోలో కూలీ:
- మరో బాక్సాఫీస్ సునామి ఖాయమా?
Kollywood News : సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు (Super star Rajinikanth, Lokesh kanagaraj Combo) కాంబోలో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ కూలీ(Coolie). వీరిద్దరి కాంబోలో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండే ఆడియన్స్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఫిక్స్ అయిపోయారు.లోకేష్ కనకరాజ్ చేసిన అన్ని మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్టయ్యాయి. ఒక మూవీకి మించి మరో మూవీతో భారీ హిట్లు కొడుతూ వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆయన నుండి మూవీ వస్తుందంటేనే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమనే రేంజ్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టు కుంటున్నారు. వారి అంచనాలకు మించి మూవీస్ తీసి థ్రిల్ చేస్తున్నాడు.
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ( Sun Pictures Bannar ) కళానిధి మారన్ ప్రొడ్యూసర్ గా దాదాపు 350 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని మూవీ మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.
ఆగస్టు 2న Coolie ట్రైలర్..
ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ లోకేష్ కనకరాజు మాట్లాడుతూ ఎప్పుడూ చూడని రజనీని ఇందులో చూపించినట్టుగా చెప్పుకొచ్చారు. యాక్షన్, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయన్నారు. ఆగస్ట్ 2 న ట్రైలర్ విడుదల అవుతుందని తెలిపారు. 1000 కోట్లు వసూలు చేస్తుందా అన్న ప్రశ్నకు..ఇప్పుడే చెప్పలేనని ప్రేక్షకుడు పెట్టిన టికెట్ ధరకు ఎంజాయ్ చేసేలా మూవీ ఉంటుందని చెప్పాడు.ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ కాబోతుంది.
Rajinikanth : 1000 కోట్లు సాధ్యమేనా…?
సూపర్ స్టార్ రజనీకాంత్ (Super star Rajinikanth) రేంజ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైల్ కి తగ్గ స్క్రిప్ట్ పడితే హిట్టు పెద్ద లెక్క కాదు. ఇక లోకేష్ లాంటి డైరెక్టర్ తీసిన మూవీ కాబట్టి బాక్సాఫీస్ బద్దలు అవడం ఖాయమనే అనిపిస్తోంది. ఇక కింగ్ నాగార్జున, ఉపేంద్ర, శృతి హసన్,బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్,పూజ హెగ్డే లాంటి స్టార్స్ తో నిండిపోయిన మూవీ కాబట్టి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన చాలు 1000 కోట్లు ఈజీగా కొల్లగొడుతుందని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. రజినీ స్టైల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.