ఆన్ లైన్ లో ఇలా దరఖాస్తు చేసుకోండి..
Rajiv Yuva Vikasam scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజీవ్ యువ వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నాతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ. 6000 కోట్ల వరకు రాయితీతో రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 4 లక్షల వరకూ సబ్సిడీ రుణం కేటాయించే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభం కాగా, ఏప్రిల్ 5వ తేదీ వరకూ స్వీకరించనున్నారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2 వతేదీన రాయితీ రుణాలను మంజూరు చేయనున్నారు. కాగా ప్రభుత్వం మంజూరు చేసే రుణంలో గరిష్ట భాగం 60-80 శాతం సబ్సిడీ కూడా అందిస్తున్నారు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీం ముఖ్య విషయాలతో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rajiv Yuva Vikasam scheme : ముఖ్యమైన అంశాలు ఇవే
ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి మూడు లక్షల వరకు బ్యాంకు రుణం లభిస్తుంది
లబ్ధిదారులు తీసుకునే రుణాన్ని బట్టి 60 నుంచి 80% వరకు సబ్సిడీ వర్తిస్తుంది. ఈ స్కీం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ యువతకు చెందిన ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
అభ్యర్థులకు ఈ అర్హతలు ఉండాలి
- దరఖాస్తుదారులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.
- పథకం అప్లై చేయడానికి అభ్యర్థులు తెలంగాణకు చెందినవారై ఉండాలి.
- SC, ST, BC, మైనారిటీ వర్గాలకు చెందిన యువతీ, యువకులు అయి ఉండాలి.
- దరఖాస్తు చేసే సమయానికి వారు ఏ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు.
- ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ లో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
- ఆధార్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ వివరాలు వంటి సర్టిఫికెట్లను సమర్పించాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసే విధానం
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ (https://tgobmmsnew.cgg.gov.in) ను సంప్రదించాలి
- మీ సెల్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ID ఉపయోగించి అకౌంట్ క్రియేట్ చేసుకోండి..
- వ్యక్తిగత, విద్యా, ఉద్యోగ వివరాలను పూరించండి.
- అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తులను ఏప్రిల్ 5, 2025లోగా సమర్పించాలి.
Rajiv Yuva Vikasam scheme : ముఖ్యమైన తేదీలు ఇవే..
- దరఖాస్తుల స్వీకరణ : మార్చి 17 నుంచి ఏప్రిల్ 5, 2025 వరకు స్వీకరిస్తారు.
- దరఖాస్తుల పరిశీలన : ఏప్రిల్ 6 నుంచి మే 31, 2025 వరకు పరిశీలిస్తారు.
- రుణాల మంజూరు పత్రాల పంపిణీ : జూన్ 2, 2025 నాడు పంపిణీ చేస్తారు.
ముఖ్యాంశాలు | వివరాలు |
పథకం పేరు | రాజీవ్ యువ వికాసం |
ప్రారంభించినది | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం |
ప్రారంభించిన తేదీ | 2025 |
ప్రయోజనం | ఎస్సీ, ఎస్టీ, బిసీ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి |
అడ్వాంటేజ్ | INR 3 లక్షల వరకు రుణ సదుపాయం |
అర్హత ప్రమాణాలు | నిరుద్యోగ పౌరులు |
కావలసిన పత్రాలు | ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా |
దరఖాస్తు ప్రక్రియ | ఆన్లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | https://tgobmms.cgg.gov.in/ . ఈ వెబ్‌సైట్‌లో మీరు https://tgobmms.cgg.gov.in/ ను సందర్శించవచ్చు. |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..