Sarkar Live

Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh

Rajnath Singh : హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను జోక్యం చేసుకోవ‌డం వ‌ల్లే భారత్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధం ఆగింద‌ని

Rajnath Singh

Rajnath Singh : హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను జోక్యం చేసుకోవ‌డం వ‌ల్లే భారత్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధం ఆగింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజ్‌నాథ్ ఖండించారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదంపై తన సొంత‌ నిర్ణయాలతో చర్యలు తీసుకుంటుంది. ఎవ‌రి జోక్యం అస‌వ‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. భారతదేశంలో హైద‌రాబాద్ విలీన‌మైన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం లిబ‌రేష‌న్ డే (Hyderabad Liberation Day)ను ప్ర‌తి సంత్స‌రం నిర్వ‌హిస్తోంది. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుక‌లు ఇవాళ ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్య అతిథిగా హాజ‌రైన రాజ్‌నాథ్‌సింగ్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ ఇండో-పాక్ సంబంధాలపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మా నిర్ణ‌యాలు మేమే తీసుకుంటాం

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను ఎవరూ ఆపలేదని, అది పూర్తిగా భారతదేశం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమ‌ని రాజ్‌నాథ్ తెలిపారు. భవిష్యత్తులో ఏదైనా ఉగ్రదాడి జరిగితే భారత్ మళ్లీ అదే ధైర్యంతో ఆపరేషన్‌ను పునరావృతం చేస్తుందని తేల్చిచెప్పారు. భార‌త్‌-పాక్ మ‌ధ్య మూడో పార్టీ జోక్యం అనే మాట అస‌లు ఉండ‌ద‌న్నారు. భార‌త‌దేశ‌మే సొంత నిర్ణ‌యాల‌తో ముందుకు వెళ్తుంద‌ని అన్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ కూడా “భారత్ ఎప్పుడూ మూడో పార్టీని అంగీకరించదు” అని చెప్పిన విషయాన్ని రాజ్‌నాథ్‌ (Defence Minister Rajnath Singh) గుర్తు చేశారు.

రాజ్‌నాథ్ (Rajnath Singh) ఎందుక‌లా అన్నారంటే..

‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అనేది భారత్ చేపట్టిన ఒక ప్రత్యేక సైనిక చర్య. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి దేశ భద్రతను కాపాడటమే దీని ఉద్దేశం. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ ఎప్పుడూ కఠినంగా వ్యవహరించిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్‌కు భార‌త్ గట్టి సందేశం కూడా ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మాట్లాడుతూ “నా జోక్యం వల్లే భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగింది” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని భారత ప్రభుత్వం ఖండిస్తూ వ‌చ్చింది. ఇండో-పాక్ వివాదం పూర్తిగా ద్వైపాక్షిక విషయమ‌ని, మూడో పార్టీకి ఇందులో స్థానం లేదని చెబుతోంది. ఇదే విష‌య‌న్ని రాజ్‌నాథ్ నాథ్ సింగ్ ప్ర‌స్తావించారు. భార‌త‌దేశానికి ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేద‌ని ఆయ‌న (Defence Minister Rajnath Singh) తేల్చి చెప్పారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?