గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janvi Kapur)జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchi babu) దర్శకుడుగా రూపొందుతున్న మూవీ కి టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు దర్శకుడి గా మారి వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన మూవీని తెరకెక్కించారు. మొదటి మూవీతోనే సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ఈ మూవీ వచ్చి 4 సంవత్సరాలు అయినా రామ్ చరణ్ తో మూవీ చేయడానికి వెయిట్ చేశాడు. రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో మూవీ గేమ్ చెంజర్ అయిపోయాక ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యాడు. గేమ్ చేంజర్ బడ్జెట్ 450 కోట్లు పెట్టిన వసూళ్లు మాత్రం 200 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కొందరు ఆడియన్స్ ఈ మూవీని డిజాస్టర్ అని తేల్చేశారు.
కొందరు అభిమానులు మాత్రం మూవీ బాగుందని దీనికంటే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్ ఆ మూవీల వైపే మొగ్గు చూపారని దాంతో కలెక్షన్స్ తగ్గాయి అంటున్నారు. పెట్టుబడులు రాబట్టకపోయినా రాంచరణ్ యాక్టింగ్ మాత్రం అదిరిందని కితాబిచ్చారు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా Ram Charan మూవీ
Ram Charan New Movie : ఇదిలా ఉండగా రాంచరణ్, బుచ్చిబాబు కాంబో లో మూవీ రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా చిత్రీకరణ జరుపుకుంటుండగా లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ని’ పెద్ది ‘(peddhi)అని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీకి అటువంటి టైటిల్ ఏంటని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మూవీ కథకు అదే టైటిల్ యాప్ట్ గా ఉందేమోనని కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా టైటిల్ ని పెడితే బావుంటుందేమోనని మరికొందరు ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈ టైటిల్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.
ఇదివరకు రంగస్థలం, గేమ్ చేంజర్ మూవీస్ టైటిల్ పై కూడా చర్చ జరిగింది. కానీ ఆ మూవీస్ రిలీజ్ అయ్యాక పర్ఫెక్ట్ టైటిల్ అని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. మొత్తానికి బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ స్పోర్ట్స్ మూవీకి పెద్ది టైటిల్ నిర్ణయించామని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..