Tollywood Classics | అదే బాబాయ్ జనరేషన్ గ్యాప్ అంటే అని ఆహా మూవీలో జగపతిబాబుతో తన అన్న కొడుకు అన్న ఒక డైలాగ్ కి ఆరెంజ్ మూవీ కరెక్ట్ గా సరిపోతుందేమో. అలా ఉంది ఆ మూవీ వసూళ్ల పరిస్థితి. 15 సంవత్సరాలు అవుతున్న వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తుంది. రామ్ చరణ్ (Ram Charan) మగధీర ఇండస్ట్రీ హిట్ తర్వాత చాలా కథలు విని అప్పటికి మంచి ఫామ్ లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar) డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
చాలామంది మగధీర (Magadheera) లాంటి సినిమా తర్వాత ఇలా లవ్ ఎంటర్టైనర్ చేయడం సరి కాదేమో అని కూడా సలహాలు ఇచ్చారట. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej) మాత్రం ఆరెంజ్ (Orange ) కథ విని ఓకే చేశాడు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో అప్పటికి సినిమాలు చేయక చాలా కాలమే అయిపోయింది. కథను నమ్మి అంజనా ప్రొడక్షన్స్ లో ఈ మూవీని స్టార్ట్ చేశారు నాగబాబు (Naga babu).
హారిస్ జయరాజ్ సూపర్ సాంగ్స్
ఈ మూవీకి హరిస్ జయరాజ్ (Haris Jayaraj) ఇచ్చిన పాటలు ఓ రేంజ్ లో మారుమోగాయి. వాటితోనే మరో ఇండస్ట్రీ హిట్టు చరణ్ ఖాతాలో పడ్డట్టే అనుకున్నారు. తగ్గట్టుగా రిలీజ్ అయ్యాక మొదటి రోజు మంచి ఓపెనింగ్సే రాబట్టింది. కానీ రెండో రోజు నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. అప్పటి జనరేషన్ ఈ స్క్రీన్ ప్లే తో గందరగోళంలో పడిపోయారు. మూవీ స్టోరీ అర్థం కాలేదు. ఫలితంగా భారీ నష్టాలను చవిచూసింది. డిజాస్టర్ గా అప్పటి అభిమానులు తేల్చేశారు. అప్పటివరకు తను సంపాదించుకున్న ఆస్తులను కూడా ప్రొడ్యూసర్ నాగబాబు పోగొట్టుకున్నారు. ఆ టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నట్టు చాలాసార్లు చెప్పుకొచ్చారు. కానీ అప్పటి అభిమానులు వేరు… ఇప్పటి అభిమానులు వేరు. జనరేషన్ మారింది కాబట్టి ఈ మూవీకి ఒక క్లాసిక్ స్టేటస్ ఇచ్చారు.
Ram Charan కెరీర్ లో ఒక క్లాసిక్
రామ్ చరణ్ కెరియర్లో ఒక క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది. గత సంవత్సరం ఈ మూవీని రీ రిలీజ్ చేయగా ఊహించని రీతిలో నాలుగు కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఒక డిజాస్టర్ మూవీ ఇన్ని కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ మూవీ ఎప్పుడో యూట్యూబ్లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. ఆడియన్స్ తమ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మూవీని చూసుకోవచ్చు. కానీ థియేటర్ కి వచ్చి ఆరెంజ్ మూవీ సాంగ్స్ కి, అందులోనే సీన్స్ కి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఇప్పటి వాళ్ళకి ఎంత కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
రెండవ రీరిలీజ్ లో అదే క్రేజ్
అలాగే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున మళ్లీ ఈ మూవీని రెండవసారి రీ రిలీజ్ చేయగా అదే క్రేజ్ ఆడియన్స్ చూపెడుతున్నారు. లిమిటెడ్ థియేటర్లలోనే రిలీజ్ చేయగా ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. బుక్ మై షో లో టికెట్స్ హాట్ కేకుల అమ్ముడుపోతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన మూవీస్ ని పక్కన పెట్టి మరి ఆరెంజ్ మూవీ చూడడానికి ఎగబడుతున్నారు. ఈ క్రేజ్ ను చూసి కొన్ని థియేటర్లు కొత్త మూవీస్ ని పక్కన పెట్టి ఆరెంజ్ మూవీ (Ram Charan Orange Movie )ని ప్రదర్శిస్తున్నారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజే కోటి రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయని సమాచారం. ఒక మూవీ వారం రోజులు ఆడడం కష్టమైనా ఈ రోజుల్లో ఈ మూవీ రెండు వారాలు ఆడి రికార్డు కలెక్షన్లు సాధించేలా ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








