Peddi teaser Release | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram charan), జాన్వీ కపూర్ (Janvi Kapoor) జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Bucchi babu Sana)డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ పెద్ది (Peddi). గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ నుండి టైటిల్ అప్డేట్ వచ్చిన దగ్గర నుండి ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. మూవీ టీం ఏ చిన్న అప్డేట్ ఇచ్చిన ఫ్యాన్స్ కి హోప్స్ పెరిగిపోతున్నాయి. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుండి ఫస్ట్ షాట్ టీజర్ ని వదిలారు. దీనికి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
క్రికెట్ నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో చరణ్ లుక్స్ వైజ్ గా డిఫరెంట్ వేరియేషన్ ని చూడబోతున్నాం. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ డైలాగులు చెప్పిన తీరు చూస్తే పూర్తిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడనిపించింది. ముక్కు పోగు తో, రగ్ డ్ లుక్ , నోట్లో బీడీ పెట్టుకున్న లుక్ లో అయితే సూపర్ గా ఉన్నాడు. ఈ మూవీ తో చరణ్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తాడని ఫాన్స్ అనుకుంటున్నారు.
రంగస్థలం (Rangasthalam)మూవీ లో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లో చరణ్ ని చూశాం.. ఈ మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుంది.. కానీ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్, లుక్స్ చూస్తే డిఫరెంట్ చరణ్ ను చూడబోతున్నామ నిపించింది. కచ్చితంగా ఈ మూవీ చరణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా తీర్చిదిద్దారనిపిస్తోంది. ప్రతి షాట్ ని కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
Peddi Movie మార్చి 27న రిలీజ్…
టీజర్ లాస్ట్ లో మూవీ రిలీజ్ డేట్ ని కూడా మూవీ టీం అనౌన్స్ చేసింది. మార్చి 27 ,2026(March 27,2026)న పెద్ది గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మార్చి 27 రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భంగా రిలీజ్ అవుతున్న పెద్ది వండర్స్ క్రియేట్ చేయబోతున్నట్లు టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఈ మూవీకి మ్యూజిక్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు టీజర్ ద్వారా ఆడియన్స్ కి చెప్పాడు.
అదిరిన బీజీఎం…
నేరుగా చేసే తెలుగు మూవీస్ కి రెహమాన్ సరైన మ్యూజిక్ ఇవ్వడు అనే పేరుంది. పెద్ది మూవీతో దాన్ని బ్రేక్ చేయబోతున్నట్లు టీజర్ లో ఇచ్చిన బీజీఎంతో చెప్పాడనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ ప్రజెంట్ చేస్తుండగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ యాక్ట్ చేస్తున్నారు.
Edaina ee nela midha unnapude seseyala
Peddi peddi 🔥🔥🔥🔥
An @arrahman musical 😍😍😍💥💥#Peddi #PeddiFirstShot pic.twitter.com/4XOGIATull
— T-Series South (@tseriessouth) April 6, 2025