Ram Gopal Varma : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ముంబై సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant-NBW) జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసు (cheque bounce case)లో కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని ఆయన అభ్యర్థించగా న్యాయస్థానం దానిని తిరస్కరించింది.
Ram Gopal Varma కేసు నేపథ్యం ఇదే..
రామ్ గోపాల్ వర్మకు చెందిన సంస్థపై 2018లో ఓ కంపెనీ చెక్ బౌన్స్ కేసు ((cheque bounce case) దాఖలు చేసింది. ఈ కంపెనీ హార్డ్ డిస్క్‌ల సరఫరా వ్యాపారంలో ఉంది. 2018 ఫిబ్రవరి, మార్చి మధ్య వర్మకు చెందిన సంస్థ హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేయగా అందుకు సంబంధించి మొత్తం రూ.2,38,220 విలువైన ఇన్వాయిస్‌లను ఆ కంపెనీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సంస్థ 2018 జూన్ 1న రూ.2,38,220 విలువైన చెక్ జారీ చేసింది. అయితే, ఆ చెక్ బ్యాంక్‌లో జమ చేసేటప్పుడు అకౌంట్‌లో నిధులు లేకపోవడంతో అది తిరస్కరణకు గురైంది. దీంతో హార్ట్‌డిస్క్‌లు సరఫరా చేసిన కంపెనీ వర్మ సంస్థను సంప్రదించి మళ్లీ చెక్ ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో రెండోసారి కూడా వర్మ సంస్థ చెక్‌ను జారీ చేసింది. కానీ ఈసారి కూడా ఆ కంపెనీకి చుక్కెదురైంది. ‘డ్రాయర్ ద్వారా చెల్లింపు నిలిపివేయబడింది’ అనే కారణంతో చెక్ తిరస్కరణకు గురైంది.
కోర్టు మెట్లు ఎక్కిన కంపెనీ
చెక్కు బౌన్స్ కావడంతో ఆ కంపెనీ యాజమాన్యం న్యాయపరమైన చర్యలకు పూనుకుంది. 2025 జనవరి 21న Andheri Judicial Magistrate (First Class) అంధేరి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) వై.పి. పుజారి ఈ కేసును విచారణ జరిపి, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం రామ్ గోపాల్ వర్మను దోషిగా తేల్చారు. కోర్టు వర్మకు మూడు నెలల జైలు శిక్ష విధించి, రూ.3,72,219 మొత్తాన్ని ఫిర్యాదుదారుకు మూడు నెలల్లో చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
సెషన్స్ కోర్టులో అప్పీల్
తనపై విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) ముంబై సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అయితే, మార్చి 4న అదనపు సెషన్స్ జడ్జి ఎ.ఎ. కులకర్ణి ఈ అభ్యర్థనను తిరస్కరించి, కోర్టుకు హాజరుకాలేకపోవడం నేరంగా పరిగణిస్తూ వర్మకు NBW జారీ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..