Ram Gopal Varma | ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ వారిలో రాంగోపాల్ వర్మది మాత్రం డిఫరెంట్ స్టైల్. ఒక్కో డైరెక్టర్ కు వారి సినిమాలు నచ్చి కొంతమంది ఫ్యాన్స్ అయితారు. కానీ వర్మకు డైరెక్టర్లె ఫ్యాన్స్ గా ఉంటారు. డైరెక్టర్ల లో కెల్లా వర్మ వేరయా అంటుంటారు ఆడియన్స్.
ఒకప్పుడు శివ(Shiva), క్షణక్షణం, రంగీలా, బూత్, సర్కార్ లాంటి ఎన్నో సినిమాల తో ట్రెండ్ సెట్ చేసిన వర్మ.. కొన్ని సంవత్సరాలుగా తనకు నచ్చేట్టు మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇదేంటి మీరు ఇలాంటి మూవీస్ తీస్తున్నారు అని అడిగిన ప్రశ్నలకు మాత్రం ఒకటే సమాధానం నా ఇష్టం అనే సమాధానం మాత్రమే వస్తుంది. నా ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తా నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అని ముఖం మీదే చెప్తుంటారు.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) హిట్టు కొట్టి చాలా కాలమే అయిపోయింది. తన మార్క్ సినిమాలను మర్చిపోయి కొన్ని సంవత్సరాలుగా బూతు సినిమాలనే తీసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇటీవల తను డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ సత్య 27 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ ఆ మూవీని చూశాడట. మూవీ చూశాక కన్నీళ్లు వచ్చాయని, తనకు జ్ఞానోదయమైందని, ఇకపై తను మంచి సినిమాలే తీస్తానని, ఈసారి సత్యమే చెప్తున్నట్టు సత్య మూవీ పైనే ఒట్టు వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఇది చూశాక నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వర్మ మారడమా… ఇంతకుముందు ఇలాంటి ఒట్లు చాలామంది పైన వేశాడని, తనపై కూడా ఒట్టు వేసుకున్నాడని, ఇక తను డైరెక్ట్ చేసిన సత్య మీద ఒట్టు వేయడం ఓ లెక్కన అంటున్నారు. కానీ కొందరూ వర్మ ఈసారి సాలిడ్ హిట్టు కొట్టబోతున్నాడని ఊహించుకుంటున్నారు.
Ram Gopal Varma Movies : వర్మ రాబోయే సినిమా ఇదే..
ఇదిలా ఉండగా వర్మ నెక్స్ట్ తీయబోయే సినిమా పేరును కూడా వెల్లడించారు. సినిమా పేరు సిండికేట్ అని ఇది గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంలో రాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈసారి వర్మ కాన్ఫిడెంట్ చూస్తే అంతకుముందు చెప్పిన మాటల కంటే డిఫరెంట్ గా ఉందని అనుకుంటున్నా… సడెన్ గా ఆయన ఒక మూవీ చూసి మారిపోయానని చెప్పడం.. ఆయన నుండి అలాంటి మాటలు రావడం సినీ ప్రేక్షకులకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. మరి వర్మ నిజంగా మారి తనలో ఉన్న జీనియస్ డైరెక్టర్ ని బయటకి తీసి మళ్లీ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీస్తాడా…లేకపోతే ప్రేక్షకులు సిండికేట్ మూవీ గురించి మాట్లాడుకోవాలని ఆ మూవీపై అంచనాలను పెంచాలని అలా చెప్పుకొచ్చాడ అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఆడియన్స్ నాడి వర్మకు బాగా తెలుసు. వర్మ మాటలను కూడా ఆడియన్స్ సీరియస్ గా తీసుకోరు. ఇది వర్మకు, అడ్వాన్స్ కు షరా మామూలే. మునుపటి వర్మని చూపిస్తామంటే అంతకంటే ఆనందమా అని కొందరు వర్మ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంకా ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారో తెలియకుండానే ఇంత హాట్ టాపిక్ గా మారిన సిండికేట్ మూవీ మునుముందు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








