- మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
- హత్యకు దారితీసిన కులాంతర వివాహంకారణం..!?
Ranga Reddy | సమాజంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకోవడమే ఏదో నేరమన్నట్లు క్రూరంగా చంపేస్తున్నారు.సోమవారం ఉదయం డ్యూటీ కి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ (Constable) దారుణంగా హత్యకు గురయింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది. తోడపుట్టిన తమ్ముడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకెళితే..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి ఇటీవలే తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. దాంతో ఆమెపై కుటుంబ సభ్యులు కొంతకాలం నుంచి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం బైక్ పై డ్యూటీ కి వెళ్తున్న నాగమణిని రాయపోలు, ఎండ్లగూడ దారిలో సొంత తమ్ముడు పరమేశ్ కారుతో ఢీకొట్టి కత్తితో దారుణంగా నరికి చంపినట్లు సమాచారం. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగి కారు నంబర్ ప్లేటు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సోదరుడు పరమేశ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Also Read : Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
One thought on “Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు”