Dasara Ravanavadha 2025 | వరంగల్ : విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2న గురువారం సాయంత్రం రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణవధ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మహంకాళి గుడి ఆవరణలో రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్ లు ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించినారు.
ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ ఏడాది 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల బాణసంచాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రావనవధ (Ravanavadha) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు, విశిష్టఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్, గౌరవ అతిథులుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, ప్రత్యేక అతిథులుగా 10వ అడిషనల్ సికింద్రాబాద్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ డాక్టర్ కంచ ప్రసాద్, సీనియర్ నాయకులు గోపాల నవీన్ రాజ్, 42 వడివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, 41 వడివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్ధన్, సీనియర్ పాత్రికేయులు శంకేసి శంకర్‌రావు విచ్చేస్తున్నారని అన్నారు.
ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి దామెరకొండ కరుణాకర్ మాట్లాడుతూ విజయదశమి పండుగ రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జమ్మిపూజ నిర్వహించి మహంకాళి ప్రాంగణానికి చేరుకుంటామని అనంతరం సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. కావున రంగసాయిపేట శంభునిపేట ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలందరూ అధిక సంఖ్యలో ఈ రావణ వధ కార్యక్రమానికి విచ్చేసి తిలకించి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులు ముత్తినేని రామమూర్తి, కొక్కొండ భాస్కర్, పరికిపండ్ల రాజేశ్వర్ రావు, మండల లక్ష్మయ్య, మడుపోజు రామ్మూర్తి, బివి రామకృష్ణ ప్రసాద్, వలుపదాసు రాజశేఖర్, శంకేశి వెంకటేశ్వర్లు, కంచ రమేష్, పాకాల మనోహర్, బజ్జూరి వీరేశం, బక్కి వంశీ, పస్తం బిక్షపతి, చిమ్మని చంద్రమౌళి, పాకాల రాజేందర్, పూసల కిరణ్, కన్నెబోయిన కుమార్, ఏలుగు అశోక్, అవునూరి కుమార్, అల్లం వీరస్వామి, ఇట్టబోయిన ప్రదీప్, విజయగిరి మాల్యాద్రి, కర్నే రవీందర్, అంబటి రమేష్, మహంకాళి దేవాలయ ప్రతినిధులు పాకాల చక్రపాణి, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    