Sarkar Live

Ratha saptami : రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం

Ratha saptami in Tirumala : తిరుమలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం దృష్ట్యా భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

TTD darshan tickets

Ratha saptami in Tirumala : తిరుమలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం దృష్ట్యా భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 4న జరిగే ఈ వేడుక భ‌క్తుల‌కు క‌నుల‌విందు చేయ‌నుంది.

Ratha saptami : రథసప్తమి విశిష్టత

సూర్యారాధనకు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా ఈ పూజను చేస్తారు. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ వేడుక‌ వస్తుంది. దీనిని రథ సప్తమి (Ratha saptami) అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై ప్ర‌యాణించి దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తుల విశ్వసం. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.

భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు

రథసప్తమి నాడు రెండు లక్షల మందికిపైగా భక్తులు తిరుమల (Tirumala Tirupati Devasthanam)ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో వీఐపీ, ప్రత్యేక దర్శనాలను పూర్తిగా ర‌ద్దు చేశారు. అలాగే భక్తుల ర‌ద్దీని నియంత్రించడానికి ఈ మూడు రోజుల్లో సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేయరు.

వాహన సేవల వివరాలు

రథసప్తమి (Ratha saptami) వేడుకలు ఫిబ్ర‌వ‌రి 4న ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమవుతాయి. ఈ సంద‌ర్భంగా స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తారు. మాడ‌ వీధుల మీదుగా సాగే ఈ వాహ‌న సేవ రాత్రి 9:00 గంటలకు ముగుస్తుంది. దీనిని చంద్రప్రభ వాహన సేవ అంటారు. భక్తులు ఈ కార్య‌క్ర‌మాన్నివీక్షించేందుకు ప్ర‌త్యేక గ్యాల‌రీల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

స్వామివారి చక్రస్నానం

ఉత్సవంలో భాగంగా పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఇది అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఘట్టం కాగా భక్తుల కోసం పుష్కరిణి వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్నప్రసాదాల పంపిణీ

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే దృష్ట్యా టీటీడీ అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. మాడ వీధుల్లోని గ్యాలరీలలో భక్తులు వేచి ఉండే సమయంలో వారికి అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు.

భద్రతా ఏర్పాట్లు

రథసప్తమి సందర్భంగా భద్రతను పటిష్టం చేయడానికి అదనపు పోలీసు బలగాలను మోహ‌రిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌కుండా ప‌టిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను భారీ సంఖ్య‌లో బిగించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?