ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అది రవితేజ (mass maharaja Ravi Teja) కి సాధ్యమైంది. తను ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి సైడ్ క్యారెక్టర్ లు చేశారు. అలా రవితేజ కెరీర్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని హీరో అయ్యారు. పూరి జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్ లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తో మంచి హిట్టు కొట్టారు. వెంటనే ఆయన డైరెక్షన్ లోనే ఇడియట్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ వరుసగా ప్లాఫ్ కూడా అయ్యాయి. కానీ హిట్టు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూనే ఉన్నాడు.
ఈ మధ్య రవితేజ గత కొన్ని సినిమాలు కూడా వరుసగా ప్లాఫ్ అవుతున్నాయి. త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao Nakkina) డైరెక్షన్ లో వచ్చిన ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు మూవీ వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.రవితేజ కి మిరపకాయ లాంటి హిట్టు మూవీ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా ఆడియన్స్ ను మెప్పించలేక పోయింది. దీంతో మళ్లీ మాస్ మహారాజ ప్లాఫ్ దశను ఎదుర్కొంటున్నారు.
ప్రజెంట్ మాస్ అవతారంలో Ravi Teja
ప్రజెంట్ మాస్ జాతర (Mass jathara) అనే మూవీ తెరకెక్కుతుంది. రవితేజ అంటేనే ఫుల్ మాస్. టైటిల్ కూడా ఆయన యాప్ట్ గా పెట్టడం లోనే మూవీ ఎలా ఉంటుందో అనే ఆసక్తిని అభిమానుల్లో క్రియేట్ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తన మాస్ పర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా మూవీ ఉండబోతున్నట్టు టాక్.ఈ మధ్య రవితేజ మూవీస్ లో వింటేజ్ కామిడీ ని మిస్ అవుతున్నట్టు అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ మూవీ వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయదనే ఆశాభావం తో ఉన్నారు.మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కిషోర్ తిరుమల డైరెక్షన్ లో..?
లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజ నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల(kishore thirumala) డైరెక్షన్ లో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. కిషోర్ తిరుమల తన మూవీస్ లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తాడు. చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ మూవీస్ చూస్తే ఎమోషన్స్ తోనే ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. తనదైన శైలిలోనే రవితేజతో మూవీ కూడా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.రవితేజ కామెడీ తో పాటు ఎమోషన్స్ కూడా ఎలా అభినాయిస్తాడో మనకు తెలుసు.వీరి కాంబినేషన్లో మూవీ వస్తుందనే వార్తతో అభిమానులు సంబరపడి పోతున్నారు. కొన్ని రోజుల్లో వీరి మూవీపై అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









2 Comments
[…] పూరీ కి క్లాషెస్ కూడా వచ్చినట్టు వార్తలు […]
[…] ఉండగా మాస్ మహారాజా రవితేజ 76 వ మూవీని ఒక క్లాస్ డైరెక్టర్ తో మూవీ […]