- రెజోనెన్సు పలుకుబడి కి తలొగ్గిన అధికారి?
- అనుమతి లేని వేదాంతుకు సపోర్ట్
- బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఎలా స్పందిస్తారో..
హన్మకొండ నగరం (Hanamkonda) లో ఒకరేమో అకాడమీ పేరుతో అనుమతి లేకుండా జూనియర్ కళాశాల (Illegal colleges) నడిపిస్తుంటే, మరొకరు అనుమతికి మించి అదనంగా మరో 5 బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు కాలేజీల బాగోతంపై వరుస కథనాలు వెలువరించినప్పటికీ సంబంధిత అధికారి మాత్రం ఇంటర్మీడియట్ బోర్డుకు రిపోర్ట్ రాసి పంపిస్తామని చేతులు దులుపుకుని చూస్తున్నారు. ఇక్కడ అసలు రహస్యం ఏమిటంటే రెజోనెన్సు యాజమాన్యంతో పాటు వేదాంతు యాజమాన్యం సదరు అధికారిని ప్రసన్నం చేసుకోవడం వల్లే డీఐఈవో ఈ రెండు కాలేజీలను సీజ్ చేయకుండా ఇంటర్మీడియట్ బోర్డుకు రిపోర్ట్ రాస్తామని మాయమాటలు చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
డీఐఈఓ వింత సమాధానం…
హన్మకొండ నగరంలో అనుమతి లేకుండా నడుస్తున్న రెజోనెన్సు కాలేజీలు, అకాడమీ పేరుతో కళాశాల నిర్వహిస్తున్న వేదాంతు కాలేజీల (Illegal colleges) పై ఫోటోలతో సర్కార్ లైవ్ వరుస కథనాలు వెలువరించగా చరవాణి లో స్పందించిన డీఐఈఓ గోపాల్ అనుమతి లేని కాలేజీలను సీజ్ చేసే అధికారం తనకు లేదని,ఇంటర్మీడియట్ బోర్డుకే సీజ్ చేసే అధికారం ఉంటుందని వింతగా చెప్పారు.రెజోనెన్సు, వేదాంతు కాలేజీలపై రిపోర్ట్ రాస్తామని చెప్పిన డీఐఈఓ ఇప్పటివరకైనా ఆ రెండు కాలేజీలపై బోర్డ్ కు రిపోర్ట్ రాసారా లేదా అనేది సదరు అధికారికే తెలియాలి. మరి అనుమతి లేని రెజోనెన్సు, వేదాంతు కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.