Return of The Dragan Movie Review | లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగానాథన్ (Pradeep Ranganaadhan), అనుపమ పరమేశ్వరన్ (Anupama parameshvaran), కాయాదు లోహర్ (Kayadh lohar) హీరో హీరోయిన్లుగా ఓరి దేవుడా మూవీతో సూపర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తూ (Ashwath marimutthu) డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ (Return of The Dragan).ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది ఇందులో నటీనటులు ఎలా పర్ఫామెన్స్ చేశారు,ఆడియన్స్ ని మెప్పించిందా లేదా అనేది తెలుసుకుందాం.
మూవీ కథ విషయానికి వస్తె ఇంటర్ లో బాగా చదివి మంచి పర్సెంట్ తో పాసైన ఓ కుర్రాడు ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. మంచిగా చదివే వాళ్ళను ఈ అమ్మాయిలు పట్టించుకోరు,అల్లరిగా ఉండే అబ్బాయిలనే వీళ్ళు ఇష్టపడతారనుకుంటాడు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాక డిఫరెంట్ గా మారిపోతాడు.తన పేరును డ్రాగన్ గా మార్చుకొని అల్లరి చిల్లర స్టూడెంట్ గా మారిపోతాడు.తనను అలా చూసి ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. కాలేజ్ లో కూడా ఇతడికి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. కానీ లాస్ట్ కి సబ్జెక్ట్స్ దొబ్బుతాయి. ఆ తరవాత తన జీవితం ఎలా మలుపు తిరిగింది. ప్రేమించిన అమ్మాయి తనతోనే ఉందా…అతడు ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథ.
Return of The Dragan 2025 ఎలా ఉందంటే..
ప్రజెంట్ యూత్ ఆలోచన లను పట్టుకుని స్క్రిప్ట్ రాసి దర్శకుడు భలే తెరకెక్కించాడు. యూత్ ఎంజాయ్ చేసేలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.అలాగే మంచి మెసేజ్ కూడా ఈ మూవీలో ఉంటుంది. ఓరి దేవుడా మూవీతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆశ్వత్ మారిముత్తు ఈ మూవీ స్టోరీ ని కూడా విజయవంతంగా నడిపించారు.హీరో ప్రదీప్ రంగనాథ న్ కోసమే ఈ స్టోరీ పుట్టిందా అన్నట్టుగా ఈ పాత్రలో నటించారు. ఇంటర్ వరకు ఒక బుద్ధిమంతుడు, ఆ తరవాత అల్లరి కుర్రాడిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన తీరుకు మంచి మార్కులే పడ్డాయి. ఒక భాధ్యత లేకుండా ప్రవర్తించి అందరూ చీ అనుకునేలా ఉండే క్యారెక్టర్ ని శబాష్ అనిపించేలా తీర్చిదిద్దడం ఊహించిందే అయినా మలిచిన తీరు బాగుంది.ఇంటర్ లో యూత్ ఆలోచనలు, అదే ఇంజనీరింగ్ వెళ్ళాక ఆలోచనలు మారుతాయి. చాలా మంది కొంచెం అల్లరి అల్లరిగా ఉంటేనే అందరూ గుర్తిస్తారు, ఫోకస్ అవుతామనే ఆలోచన ప్రజెంట్ జనరేషన్ లో చాల మందికి ఉంటుంది. ఈ మూవీ చూశాక హీరో పాత్రలో చాలా మంది కనెక్ట్ అవుతారు. మొదట ఎలా కనెక్ట్ అవుతారో అలానే తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యేలానే ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లో ఆడియన్స్ కి కొంచెం బోర్ కొట్టేలా ఉన్నా పెద్దగా ఎఫెక్ట్ పడదు. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రజెంట్ యూత్ ఆలోచనలో పడేసే మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ అని చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
Return of The Dragan review : ప్రదీప్ రంగనాథన్ రాఘవన్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. నటన చాలా క్రేజీ గా ఉందనడంలో సందేహం లేదు.అందరూ ఈ పాత్రకు కనెక్ట్ అవుతారు. అనుపమ పరమేశ్వరన్, కాయాదు లోహార్ పర్ఫామెన్స్, గ్లామర్ ఆకట్టుకుంటుంది.అలాగే మిగితా నటులు కూడా వారి వారి పాత్రల్లో బాగానే నటించారు.లియోన్ జేమ్స్ పాటలు పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు. బీజీఎం ఓకే అనిపించింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. బొమ్మిరెడ్డి నికేత్ సినిమాటోగ్రఫీ బాగుంది. అశ్వత్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా బాగానే తీశాడు. ఆఖరిగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ యూత్ మెచ్చే మూవీ అనిపిస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








