Hyderabad : : ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో పదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అలజడి వ్యక్తమవుతోన్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Congress : సీఎం రేవంత్ ఏమన్నారు?
శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను 2034 వరకు పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడని, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శాసనసభ్యులకు మింగుడు పడలేదు, వారిలో కొందరు ఈ వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) విమర్శలు గుప్పించారు. ఇటువంటి ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ సూత్రాలకు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు విరుద్ధమని పేర్కొన్నారు. పార్టీని వ్యక్తిగత ఆస్తిగా మార్చడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు.
“కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ (Congress Party), పార్టీ హైకమాండ్ సూచనల ప్రకారం ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేస్తారు. నిజాయితీగల కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత రాజ్యంగా మార్చే ప్రయత్నాలను సహించరు ” అని ఆయన X పై ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025
రేవంత్ రెడ్డి ఇలాంటి వాదనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా తాను దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన స్ఫష్టం చేశారు. తన పాలనా శైలిపై కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులలో అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి ఈ ఏడాది మార్చిలో పాత్రికేయులతో అనధికారిక సంభాషణ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ప్రజలు తనను రెండవసారి ఎన్నుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.